Ambati Rambabu: అంబటి రాంబాబుకు పోలీసుల షాక్..! భయపడాలా అని మాజీ మంత్రి ప్రశ్న..!

ఏపీలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిన్న వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా గుంటూరులోని ఫ్లైఓవర్ పై వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై ఇవాళ గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా గుంటూరులోని తన నివాసం నుంచి వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు పలుమార్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఫ్లైవర్ వద్దకు వచ్చే సరికి తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిస్తున్నా వినకుండా వారిపై విమర్శలు చేశారు.

ysrcp leader ambati rambabu booked for abusing police yesterday

పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లుకూ, వైసీపీ నేత అంబటి రాంబాబుకూ మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం అంబటి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగడం, వారి విధులకు ఆటంకం కలిగించేలా దూషణలకు దిగిన ఆరోపణలపై పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసారు. అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై బీఎన్ఎస్ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో వైసీపీ చేపట్టిన నిరసనలు సాఫీగా సాగిపోగా.. గుంటూరు మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే నిన్నటి ఘటనపై పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా ? అని ఆయన ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+