ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు: జగన్ పార్టీ నేత అరెస్టు

డోన్ పరిధిలోని రిలయన్స్ దాబా సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైయస్సార్ కాంగ్రెసు జెండా కట్టిన వాహనంలో వెళ్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత డిఎస్పీ డిఎన్ బాబు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
గత నెల వెల్దుర్తి గోదాముల్లో దొరికిన 2000 ఎర్రచందనం దుంగలను గంగిరెడ్డి అక్రమంగా నిల్వ చేశారని, ఈ కేసులో గంగిరెడ్డిని ఈ రోజు అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 32 మందిపై కేసులు నమోదు చేశామని, వీరిలో 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు.
గంగిరెడ్డి ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో సిఐ డేగల ప్రభాకర్, ఎస్సైలు సుబ్రహ్మణ్య రెడ్డి, జయన్న తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications