అవినీతి అనకొండ, లక్షన్నార చీర - మహిళా ఐఏఎస్ పై భూమన సంచలనం..!!
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు చేసారు. మహిళా ఐఏఎస్ అధికారిణి ని టార్గెట్ చేసారు. ఓబులాపురం గనుల కేసుల్లో ఆ మహిళా అధికారిణి జైలు శిక్ష అనుభవించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకి బదిలీ అయ్యారు. జగన్ హయాంలో కీలక శాఖలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అధికారిణికి పోస్టింగ్ దక్కలేదు. కాగా, ఇప్పుడు ఆ అధికారిణి లక్ష్యంగా భూమన కరుణాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది.
వైసీపీ ముఖ్య నేత భూమన కరుణాకర రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారిణి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైన తాను సిద్ధమని ప్రకటించారు. తన పై వచ్చే విమర్శలు తాను ఎప్పుడూ స్పందించనని చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాలుగా తన మనసులో ఉన్న అభిప్రాయం చెబుతున్నానంటూ ఆ అధికారిణి పైన వ్యాఖ్యలు చేసారు. గతంలో ఉన్న ఐఎఎస్ అధికారి....అవినీతిలో అనకోండ లాంటి వారని విమర్శించారు. గతంలో మంత్రులను అందరి పూచికిపుల్ల చూసారని మండిపడ్డారు. తన శాఖకు సంబందించిన మంత్రులను లెక్క కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారినీ....ఓ తాటకీలాగా కింది స్దాయి అధికారుల పట్ల వ్యవహరించారని చెప్పుకొచ్చారు.

తిరుపతి లో రోడ్లు వేస్తున్న సమయంలో అ అధికారినీ టిడిఆర్ బాండ్ల ద్వారా దోచుకోవాలని ప్లాన్ వేస్తే తాము అడ్డుకున్నామని చెప్పారు. ఇది తట్టుకోలేక నెల్లూరు జిల్లా నేతలకు సమాచారం లీక్ చేసి రెండు వేలకోట్లు దోచుకున్నారంటూ ప్రచారం చేయించారని ఐఏఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్కరూపాయి అవినీతి చేసినా తాను ఎలాంటి శిక్షకైనా రేడీ అని పేర్కొన్నారు. గత అవినీతి అధికారి 35 ఏళ్లుగా తను ఎక్కడ పనిచేసిన వందల వేల కోట్లు లూటి చేసారని తీవ్ర ఆరోపణలు చేసారు. సుప్రీంకోర్టు సైతం అమె అవినీతి తెలుసు అంటూ చెప్పిందని గుర్తు చేసారు. ఆ అవినీతి అధికారి ధరించి రోజు చీర ఖరిది ఒకటిన్నర లక్ష రూపాయలని చెప్పారు. లక్ష రూపాయలు విలువ చేసే 11 విగ్గులు ధరిస్తుందని విమర్శించారు. ఇప్పుడు భూమన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు గతంలో జగన్ కేసుల్లో ఉన్న ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి గురించే అనే ప్రచారం సాగుతోంది. దీంతో, భూమన వ్యాఖ్యలు వైసీపీలో సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications