పవన్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స- రీజన్ ఇదే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే ఈ అపాయింట్ మెంట్ తన కోసం కాదు ఇంకెవరి కోసమే కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో కోసం బొత్స సత్యనారాయణతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. అదే సమయంలో దగ్గరగా ఉన్న వీరిద్దరి మధ్య ఓ కీలక అంశం చర్చకు వచ్చింది. ముందుగా బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ను ఎలా ఉన్నారంటూ పలకరించారు. దీంతో బాగానే ఉన్నట్లు పవన్ జవాబిచ్చారు. గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో మరోసారి పవన్ తో బొత్స మాట కలిపారు.

ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్ ను బొత్స సత్యనారాయణ అడిగారు. ఎప్పుడు వస్తారో చెప్తే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని అడిగారు. దీంతో తాను ఎప్పుడు వచ్చేది త్వరలోనే చెబుతానని బొత్స సత్యనారాయణకు పవన్ తెలిపారు. ఢిల్లీ నుంచి రాగానే కొల్లేరు ఆక్వా రైతుల్ని కలుస్తానని బొత్సకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
సుప్రీంకోర్టులో కొల్లేరు ఆక్రమణల కేసు కారణంగా ఈ నెల 9 నుంచి అటవీశాఖ సర్వే నిర్వహిస్తోంది. దీనిపై మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే రేపు సుప్రీం కోర్టులో కొల్లేరు పిటిషన్ పై విచారణ జరగబోతంది. దీంతో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఉన్న ఆందోళనను బొత్స పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రైతులకు అపాయింట్ ఇవ్వాలని బొత్స కోరగా పవన్ సరేనన్నారు.












Click it and Unblock the Notifications