"లోకేష్ ఆంధ్రా నయీంలా.. కోట్లు దండుకోవడం నేర్పించడానికే వర్క్ షాప్"
విజయవాడ : రాష్ట్రంలో టీడీపీ పాలనంతా అవినీతిమయంగా మారిపోయిందని ఆరోపించారు వైసీపీ నేత గౌతం రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డ ఆయన లోకేష్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నారా లోకేష్ ఆంధ్రా నయీంగా తయారయ్యాడని ఆరోపించారు గౌతం రెడ్డి. రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టినా లోకేష్ కు ముడుపులు అందాల్సిందేనన్నారు. నేతలు కోట్ల రూపాయలను ఎలా వెనకేసుకోవాలన్నది తెలియజేసేందుకే టీడీపీ వర్క్ షాప్ నిర్వహించిందని ఎద్దేవా చేశారు. మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ నేతల శిక్షిణా తరగతుల్లో ఇదే బోధించారని చెప్పారు.
ఒక్కో ఎమ్మెల్యే రూ.40కోట్ల నుంచి రూ.50కోట్లు ఎలా సంపాదించాలని బాబు సూచనలు చేశారని దుయ్యబట్టారు. సీల్డ్ కవర్ లో ఎమ్మెల్యేల ర్యాంకులపై స్పందిస్తూ.. అవినీతిలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నవాళ్లకే చంద్రబాబు ఏ గ్రేడ్ ర్యాంకులు ఇచ్చారని గౌతం రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications