క్రికెట్ బెట్టింగ్: వైసిపి కోటంరెడ్డి విచారణ, కక్ష సాధింపు అని ఆవేదన
క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ మంగళవారం ముగిసింది. రెండున్నర గంటల పాటు ఆయనను విచారించారు. ఈ నెల 27వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఎస్పీ ఆదేశించారు.
నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ కేసులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణ మంగళవారం ముగిసింది. రెండున్నర గంటల పాటు ఆయనను విచారించారు. ఈ నెల 27వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఎస్పీ ఆదేశించారు.
మేయర్ ఎన్నిక సమయంలో గోవాలో అయిన ఖర్చును క్రికెట్ బుకీ కృష్ణసింగ్ భరించారా అని ఆరా తీశారు. అనంతరం కోటంరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్దమని చెప్పానని తెలిపారు.

రూ.40 లక్,లు తనకు అందాయి అనడంలో వాస్తవం లేదన్నారు. కృష్ణ సింగ్‌తో తాను మూడుసార్లు ఫోన్లో మాట్లాడానని తెలిపారు. కక్ష సాధింపులో భాగంగా తమను విచారిస్తున్నారని తెలిపారు. బుకీలతో తనకు సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications