ఏపీలో హింసకు వాళ్లిద్దరే కారణమా?: ఎవరీ దీపక్ మిశ్రా?

సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, దాడుల ఉదంతంపై దుమారం చెలరేగుతూనే ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేట, మాచర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి సహా కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ఇళ్లపై చోటు చేసుకున్నను అధికార పార్టీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. దీనికి ప్రధాన కారణం అంటూ వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శాస‌న‌మండ‌లి విప్ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఇంతా జరుగుతున్న పోలీసు యంత్రాంగం పట్టంచుకోవట్లేదంటూ మండిపడ్డారు.

YSRCP leader Lella Appi Reddy slams Chandrababu Naidu and Purandeswari

చంద్రబాబు, పురందేశ్వరితో పాటు వారి తోకపార్టీలకు ప్రజాస్వామ్యంపై ఎలాంటి నమ్మకం లేదని, అందుకే వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పాకులాడుతున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. పోలింగ్‌‌కు కొద్దిరోజుల ముందు పోలీసు అధికారులను బదిలీలు చేయించారని గుర్తు చేశారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే తెలుగుదేశం మూకలు దాడులకు దిగారని అన్నారు.

తమ పార్టీ కేడర్‌ను అనేక ఇబ్బందులకు గురి చేస్తోన్నారని, టీడీపీకి వత్తాసు పలికే విధంగా పోలీసు వ్యవస్థను వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు- పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమేనంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నారని, దీన్ని నిజం చేశారని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలపై దాడులు చేస్తోండటాన్ని దీనికి ఉదహరించారాయన. తమ అధికార దాహానికి, పెత్తనానికి ఈ పేద వర్గాలు అడ్డొస్తోన్నారనే ఉద్దేశంతో కక్ష పెంచుకున్నారని విమర్శించారు. తమకు మంచి చేస్తోన్న ప్రభుత్వానికి అండగా నిలవడం కూడా తప్పేనా? అంటూ నిలదీశారు.

YSRCP leader Lella Appi Reddy slams Chandrababu Naidu and Purandeswari

ఎన్నికలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా- స్థానిక పోలీసు యంత్రాంగం కార్యకలాపాలను పర్యవేక్షిొంచడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన పోలీసు అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా ఏం చేస్తోన్నాడని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారని అన్నారు.

పోలీసు అధికారులు వ్యవహరించిన తీరును పరిశీలిస్తే ఇదంతా దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు వస్తున్నాయని లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. చంద్రబాబు, పురంధేశ్వరి తమ రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థలను వాడుకుంటోన్నారని, వారి కుట్రలకు ఐఎఎస్‌, ఐపీఎస్ అధికారులు బలి అవుతున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+