వైసీపీలో కేశినేని రాకపై పీవీపీ ట్వీట్-బోరు కొచ్చిన బండి షెడ్డు మారిందంటూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల మధ్య టికెట్లకు విపరీతమైన డిమాండ్ కూడా ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ టికెట్ రాదని తేలిపోవడంతో వైసీపీలోకి ఫిరాయిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఆయన పాత ప్రత్యర్ధి, స్ధానిక నేత పీవీపీ నుంచి ప్రతిఘటన తప్పేలా లేదు.
నిన్న సీఎం జగన్ తో భేటీ అయి వైసీపీలో చేరేందుకు సంసిద్ధత ప్రకటించిన ఎంపీ కేశినేని నానిపై ఇవాళ పీవీపీ సంచలన ట్వీట్ పెట్టారు. కేశినేని నాని పేరెత్తకుండానే ఆయనపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఆ ట్వీట్ చూసిన వారెవరికైనా అది కేశినేనిని ఉద్దేశించే అని సులువుగా అర్ధమవుతుంది. దీంతో ఇప్పుడు పీవీపీ ట్వీట్ వైరల్ అవుతోంది. కేశినేని మాజీ పార్టీ టీడీపీ నేతలు కూడా ఇప్పుడు పీవీపీ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.

పీపీవీ తన ట్వీట్ లో కేశినేని నానికి బోరు కొచ్చిన బండిగా అభివర్ణించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!! అంటూ కేశినేనిపై పీవీపీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు కేశినేని రాజకీయం చివరి దశకు వచ్చేసిందనే అర్ధం వచ్చేలా పీవీపీ ట్వీట్ చేసినట్లయింది. గతంలో 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటులో కేశినేని నానితో వైసీపీ అభ్యర్ధిగా పోటీ పడిన పీవీపీ.. కేవలం 8700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి పీవీపీ సైలెంట్ గానే ఉంటున్నారు.
బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!!
— PVP (@PrasadVPotluri) January 11, 2024












Click it and Unblock the Notifications