జగన్ పార్టీ నేత వడ్డేపల్లి నర్సింహ రావు కన్నుమూత

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వడ్డేపల్లి నర్సింహ రావు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన వయస్సు 64. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుది శ్వాస విడిచారు.

వడ్డేపల్లి నర్సింహ రావు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ఉండేవారు. 2005లో ఆయన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేశారు.

YSRCP leader Vaddepalli dies

2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఏడాది క్రితం ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పూచ్చుకున్నారు. ఆయన గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.

ఆయన మృతి పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వడ్డేపల్లి మృతి పట్ల తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావు, జూపల్లి కృష్ణా రావు, మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, కూకట్‌పల్లి టిడిపి ఎమ్మెల్యే కృష్ణా రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+