వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆయన్ను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్ళీ అస్వస్థత..
— Nagarjuna (@pusapatinag) July 7, 2025
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.. pic.twitter.com/JuM9eAhxfR
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు.. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

వల్లభనేని వంశీ జూలై 2 బుధవారం రోజున విజయవాడ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులోనే ఉన్నారు. వల్లభనేని వంశీ విడుదల నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఆయన సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్ సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేశ్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు వచ్చారు. జైలు నుంచి విడుదల అనంతరం వల్లభనేని వంశీ తన భార్యతో కలిసి మాజీ సీఎం జగన్ ను కలిశారు.
ఇక వల్లభనేని వంశీని జులై 5 శనివారం రోజున మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కలిసి పరామర్శించారు. చాలా రోజుల తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగంగా కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వీరిద్దరి భేటీ తర్వాత పేర్ని నాని కూడా అక్కడకు చేరుకుని వారితో ముచ్చటించారు.












Click it and Unblock the Notifications