ఘోర ప్రమాదం: జగన్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి మృతి
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాయవేలూరు సీఎంసీ ఆ
చిత్తూరు: తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాయవేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.
కాణిపాకంకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి బెంగళూరు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది.

ఈ ఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మిగితా నలుగురిని రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications