జనసేనలోకి టీడీపీ కీలక నేత సోదరుడు..!!

గోదావరి జిల్లాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల వేళ జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఇప్పుడు మరో నేత జనసేన కండువా కప్పుకున్నారు. స్థానిక ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా పార్టీల మార్పులు జరుగుతున్నాయి. పవన్ సైతం స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. గోదావరి రాజకీయం కొత్త లెక్కలు మొదలయ్యాయి.

స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో.. కూటమి- వైసీపీ ఈ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. సీట్ల షేరింగ్ విషయం పైనా సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. పవన్ ఇప్పటికే పార్టీ పరంగా పోటీ చేసే విషయంలో స్పష్టత ఇచ్చారు. కూటమి ధర్మానికి భంగం వాటిల్లకుండా.. అదే సమయంలో పార్టీ కార్యకర్తల గౌరవం దెబ్బ తినకుండా ఎన్నికల బరిలో నిలవాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన కు సీట్ల వాటా.. పోటీ పై తేల్చేసిన మనోహర్..!!
స్థానిక ఎన్నికల్లో జనసేన కు సీట్ల వాటా.. పోటీ పై తేల్చేసిన మనోహర్..!!
YSRCP leader Yanamala Krishnudu joined in Janasena in presence of Pawan Kalyan here the full details

అవసరమైతే ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో.. జనసేన నేతల్లో పోటీ పైన ఆసక్తి పెరుగుతోంది. ఇక.. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరికల సంఖ్య పెరుగుతోంది. వైసీపీకి చెందిన నేతలు తూర్పు గోదావరిలో జనసేనలో చేరుతున్నారు. రోజు యనమల కృష్ణుడు సైతం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.

2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసారు. యనమల కృష్ణుడు.. తన సోదరుడు యనమల రామకృష్ణుడికి అండగా ఉంటూ తుని రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. టీడీపీ నుంచి తనకు బదులుగా కుమార్తె యనమల దివ్యకు తుని టికెట్ దక్కడంతో ఆయన వైసీపీ వైపు వెళ్లారు.

 స్థానిక ఎన్నికలకు పవన్ పక్కా స్కెచ్, కొత్త లెక్కలు..!!
స్థానిక ఎన్నికలకు పవన్ పక్కా స్కెచ్, కొత్త లెక్కలు..!!

2024లో తుని నుంచి యనమల దివ్య టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రాకపోవటంతో యనమల కృష్ణుడు రాజకీయంగా మౌనంగా ఉండి పోయారు. ఇప్పుడు జనసేనలో చేరారు. తుని వైసీపీ ఇంఛార్జ్ మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో విభేదాలు రావటంతో.. ఆయన జనసేనలో చేరేందుకు చర్చలు చేసినప్పటికీ.. గ్రీన్ సిగ్నల్ రావటానికి సమయం పట్టింది. పార్టీ నేతలతో చర్చించిన తరువాత పార్టీలో చేరేందు కు ఆమోదం లభించింది. దీంతో.. ఇప్పుడు యనమల కృష్ణుడు జనసేన ఎంట్రీ ద్వారా తుని రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+