నామినేషన్ల అడ్డగింత, ఆగని దౌర్జన్యాలు: ‘రాష్ట్రమంతా పులివెందుల సంస్కృతి తెస్తారా?’

తిరుపతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. మాచర్ల, తదితర ప్రాంతాల్లో దాడులను మరువకముందే తిరుపతిలోనూ అధికార వైసీపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.

నామినేషన్ల అడ్డగింత..

నామినేషన్ల అడ్డగింత..

నామినేషన్లకు 45 నిమిషాల సమయం ఉండగానే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం గేట్లను మూసివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆవరణలోనే 9,10,11,12 వార్డు సచివాలయ కార్యాలయాలు ఉండగా.. అక్కడికి వైసీపీ మినహా ఇతర అభ్యర్థులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ బీజేపీ నేత నామినేషన్ వేసేందుకు యత్నించగా.. అతడ్ని కూడా అక్కడ్నుంచి బలవంతంగా పంపించేశారు వైసీపీ నేతలు.

పోలీసులు ప్రేక్షకుల్లానే..

టీడీపీ అభ్యర్థులను అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నగర కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వైసీపీ నేతలు ఆమెను కూడా అడ్డుకున్నారు. ఈ పరిణామాలన్నీ జరుగుతుండగా పోలీసులు అక్కడేవున్నా.. దౌర్జాన్యానికి దిగిన వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడుతుండటంపై నగరపాలక సంస్థ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు.

పులివెందుల సంస్కృతెస్తారా?

పులివెందుల సంస్కృతెస్తారా?

అధికార వైసీపీ నేతలు టీడీపీ నేతలను నామినేషన్లు వేయకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా సుగుణమ్మ ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయడానికి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. పులివెందుల సంస్కృతి రాష్ట్రమంతా తెస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అక్కడంతా వైసీపీ నేతలే...

పోస్టల్ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 1,2,3,4 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. అయితే, అక్కడ కూడా టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలే వందలమంది వచ్చి క్యూలైన్లలో నిల్చుకోవడంతో ఇతర పార్టీలకు నామినేషన్లు వేసే అవకాశం రాలేదు. దీంతో అధికారుల ముందే టీడీపీ నేతలు తమ నామినేషన్ల పత్రాలను చించేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే వైసీపీ నేతల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం ఈ ఘటనలపై దృష్టిసారించింది. దాడులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+