జక్కంపూడి రాజాపై దాడిని ఖండించిన వైసీపీ

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ:వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రాపురం ఎస్ఐ నాగరాజు దాడి చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని తమ పార్టీ నాయకులను టార్గెట్‌ చేసినట్టు కనబడుతోందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపించారు.

వైఎస్సార్‌ సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, సుధాకర్‌బాబు తదితరులు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం సబ్‌ ఇన్‌స్పెక్టర్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దాడికి పాల్పడిన ఎస్‌ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Ysrcp leaders demands to take action on SI Nagaraju

చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని, రెచ్చగొట్టే చర్యలను ప్రభుత్వం ఆపాలని వారు డిమాండ్ చేశారు.

రాజాపై దాడిని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీరియస్‌గా పరిగణిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.కారు పార్కు చేసినందుకు ఈడ్చి, చొక్కాలు పట్టుకొని లాఠీలతో కొడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అండతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

రామచంద్రాపురం ఘటనతో సభ్యసమాజం తలదించుకుంటోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. దాడికి పాల్పడిన ఎస్‌ఐ నాగరాజును సస్పెండ్‌ చేయాలన్నారు. అంతేకాదు ఎస్ఐపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp leaders condemned attack on jakkampudi raja. Ysrcp leaders spoke to media at Vijayawada on Monday. they demanded to governament take necessary action against SI.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి