వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ పాదయాత్రలో బండారం బయటపెడతాం, టిడిపి నేతల్లో వణుకు'

వైసిపి అధినేత జగన్‌ తీసుకున్న కొత్త కార్యక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్‌ తీసుకున్న కొత్త కార్యక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.

రెండు రోజుల ప్లీనరీ విజయవంతమైందన్నారు. దీన్ని భరించలేక టిడిపి నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్లీనరీ వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు.

<strong>ప్రశాంత్ సలహానా.. హద్దుదాటిన షర్మిల, నేతలు?</strong>ప్రశాంత్ సలహానా.. హద్దుదాటిన షర్మిల, నేతలు?

అక్టోబరు నుంచి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. అవినీతి సొమ్ముతో ప్లీనరీ జరుపుతున్నారన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యలపై ఆయన భగ్గుమన్నారు.

మా ప్లీనరీ ఇలా

మా ప్లీనరీ ఇలా

తమ పార్టీ ప్లీనరీ ఓ పండుగలా జరిగిందని వైసిపి మరో నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాలకు భరోసా ఇచ్చేలా ఫ్లీనరీలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

మహానాడు మాత్రం అలా..

మహానాడు మాత్రం అలా..

ప్రజలకు ధైర్యాన్ని కలిగించామని బొత్స అన్నారు. మహానాడు కేవలం ప్రతిపక్షాన్ని విమర్శించేలా సాగిందన్నారు. టిడిపి సర్కారుకు ప్రాధాన్యతలేంటో తెలియట్లేదని, కనీసం వ్యవసాయానికి కూడా ప్రాముఖ్యం ఇవ్వడం లేదన్నారు.

ఆ తొమ్మిదింటిపై ఉత్సాహం

ఆ తొమ్మిదింటిపై ఉత్సాహం

ప్లీనరీలో ప్రకటించిన నవ సంక్షేమ పథకాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచాయని, పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు.

జగన్‌ను చూసి టిడిపి నేతల్లో వణుకు

జగన్‌ను చూసి టిడిపి నేతల్లో వణుకు

వైసిపి ప్లీనరీ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక టిడిపి నేతలు, మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఉదయభాను అన్నారు. జగన్‌ను చూసి టిడిపి నేతలు వణికిపోతున్నారన్నారు.

టిడిపి నేతల బండారం బయటపెడతాం

టిడిపి నేతల బండారం బయటపెడతాం

అక్టోబర్ 27 నుంచి జగన్ చేపట్టిన 3వేల కిలోమీటర్ల పాదయాత్రలో టిడిపి నేతల అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వానికి జగన్ పాదయాత్రతో కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.

English summary
YSRCP leaders say Telugu Desam in fear of their party chief YS Jagan's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X