కాషాయం కప్పుకొంటే సరిపోతుందా?
Kasinayana Ashram: కడప జిల్లా జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశినాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటామని కడప జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, అధికార ప్రతినిధి ఆరె శ్యామల జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు.

ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపుగదులు, క్షౌరశాల, గోశాల, విశ్రాంతి గదులను అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆకలి తీర్చడానికి దేవాలయాల వద్ద నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశినాయన అన్నదానం కొనసాగించారని అన్నారు.
జ్యోతిక్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించడానికి అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతి క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వంలో అటవీశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కాషాయ దుస్తులు ధరించి, సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకొంటున్నాడని, స్వయంగా జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమని చెప్పారు.
వైయస్ఆర్ జిల్లాలోని జ్యోతి కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను పరిశీలించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు
— YSR Congress Party (@YSRCParty) March 11, 2025
ఆధ్యాత్మిక స్థలాలను కూటమి ప్రభుత్వం కూల్చివేయడం దారుణం.. విధ్వంస పాలన అంటే ఇది అంటూ శ్యామల మండిపాటు
సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి… https://t.co/zELygY3uxt pic.twitter.com/uUWpoa7jn2
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరుగుతోందని, ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తోంటే సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్లాడని శ్యామల ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేదని మండిపడ్డారు.
అటవీ అనుమతులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారని, ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాశినాయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరించాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications