జగన్ బిగ్ స్టెప్

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకున్న అనంతరం పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి కూడా. కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించాయి. మంత్రి నారా లోకేష్ స్వయంగా బాధితులను పరామర్శించారు. వారిని ఓదార్చారు.

ప్రబోధినీ ఏకాదశిని పురస్కరించుకుని కాశీబుగ్గలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. కార్తీకమాసం, ప్రబోధిని ఏకాదశి పర్వదినం కావడం వల్ల ఈ తెల్లవారు జాము నుంచి భక్తులు పోటెత్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన చర్యలు, ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన సంభవించింది.

YSRCP leaders will visit Kasibugga in Srikakulam

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాలం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోవడం కనిపించింది. స్వామివారి దర్శనానికి వెళ్లే చోట తోపులాట చోటు చేసుకుంది. క్రమంగా అది పెరిగింది. ఆలయం ఆవరణలో స్టీల్ బ్యారికేడ్ సైతం విరిగిపోయిందంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్జీవంగా పడివున్న తమ వారిని బతికించుకోవడానికి కుటుంబ సభ్యులు, తోటివాళ్లు, ఆలయ సిబ్బంది ప్రాథమిక సపర్యలు చేశారు. సీపీఆర్ ఇస్తూ కనిపించారు.

ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కాశీబుగ్గకు వెళ్లనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రతినిధి బృందం ఈ మధ్యాహ్నం 12 గం.కు కాశీబుగ్గ చేరుకుంటుంది. ఘటనా స్థలాన్ని సందర్శించనుంది. అనంతరం బాధితులను పరామర్శించనుంది.

శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, నాయకులు కాశీబుగ్గను సందర్శించే వారిలో ఉన్నారు. తొక్కిసలాట సంభవించిన వెంటనే సీదిరి అప్పలరాజు సంఘటన స్థలానికి వెళ్లారు. స్వతహాగా డాక్టర్ కావడం వల్ల గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+