వంశీ అరెస్టులో కుట్ర కోణం ? ఇబ్బందుల్లో పడతారని వైసీపీ లీగల్ ఛీఫ్ వార్నింగ్..!

ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో నిన్న వంశీని అరెస్టు చేసిన పోలీసులు.. విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చి రాత్రికి రాత్రే రిమాండ్ కు పంపారు. ఈ వ్యవహారంపై వైసీపీ లీగల్ సెల్ ఇవాళ ఘాటుగా స్పందించింది. ఇందులో కుట్ర కోణం ఉందని ఆరోపించింది. లేకపోతే ఫిర్యాదు దారు అయిన సత్యవర్ధన్ యూటర్న్ తీసుకున్నప్పుడు ఆయన్ను విచారించకుండా వంశీని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.

స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను విచారించ‌కుండానే వంశీని అరెస్ట్‌ చేశారని, వంశీని అదుపులోకి తీసుకునే స‌మ‌యానికి పోలీసుల ద‌గ్గ‌ర స‌త్య‌వ‌ర్ధ‌న్ లేడని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. అయినా వంశీకి ఇచ్చిన నోటీస్‌లో నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్లు పెట్టారన్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ తీసుకొచ్చి రాత్రి 12 గంట‌ల‌కు ఎఫ్ఐఆర్ ఇచ్చారని ఆక్షేపించారు.వంశీని ఎలా ఇరికించాలో రోజంతా చంద్ర‌బాబు, లోకేష్, డీజీపీ చ‌ర్చించుకున్నారని ఆయన ఆరోపించారు.చ‌ట్టాన్ని అతిక్ర‌మించే వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది ప‌డ‌తారని, వారిని న్యాయ‌స్థానాల్లో దోషులుగా నిల‌బెట్టేదాకా వైయ‌స్సార్సీపీ పోరాడుతుందని మ‌నోహ‌ర్‌రెడ్డి హెచ్చరించారు.

ysrcp legal cell chief Manohar reddy alleges chandrababu nara Lokesh behind Vamsi arrest

గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉంద‌ని వైసీపీ లీగ‌ల్ సెల్ ఛీఫ్ మ‌నోహ‌ర్‌రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ ను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వెనుకుండి నడిపించారని తెలిపారు. స‌త్య‌వ‌ర్ధ‌న్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామ‌ని పోలీసులు చెబుతున్న మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైద‌రాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే స‌మ‌యానికి స‌త్య‌వ‌ర్ధ‌న్‌ను విచారించ‌లేద‌ని పేర్కొన్నారు. టీడీపీ క‌క్ష‌సాధింపుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయ‌స్థానాల్లో దోషులుగా నిల‌బెడ‌తామ‌ని మ‌నోహ‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+