"సిద్దం" నాలుగో సభ ముహూర్తం, వేదిక ఖరారు - జగన్ ఎన్నికల వరాలు..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలకు ఈ సారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం జగన్ ఇప్పటికే ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు దాదాపు పూర్తి చేసారు. కేడర్ ను ఎన్నికలకు సిద్దం చేసే క్రమంలో వరుసగా సిద్దం సభలను నిర్వహిస్తున్నారు.
ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చివరిది..నాలుగో సిద్దం సభకు వేదిక, ముహూర్తం ఖరారైంది. ఈ సభ నుంచే ఎన్నికల వరాలు ప్రకటించనున్నారు.

మరో భారీ సభకు సిద్దం: వైసీపీ ఎన్నికల వేళ సిద్దం సభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన మూడు సభలతో పార్టీలో జోష్ పెరిగింది. భీమిలి, దెందులూరు, రాప్తాడులో మూడు సభలు జరిగాయి. రాయలసీమలో రాప్తాడులో నిర్వహించిన సభకు వచ్చిన జన స్పందనతో ఎన్నికల సమయంలో పార్టీ కేడర్ లో జోష్ పెంచింది.
ఇప్పుడు చివరి విడతగా నిర్వహించే నాలుగో సిద్దం సభను టీడీపీ కంచుకోటలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మార్చి 2న పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో ఈ సభకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణంలో సభను నిర్వహించనున్నారు.

నాలుగు జిల్లాల శ్రేణులతో: నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరవుతారని చెబుతున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈ సారి చిలకలూరిపేట సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2019 ఎన్నికల్లో మినహా అప్పటి వరకు టీడీపీ పట్టు సాధించిన నియోజకవర్గాల్లోనే సిద్దం సభకు వేదికలుగా వైసీపీ నిర్ణయిస్తోంది.
భీమిలి, దెందులూరు, రాప్తాడు, చిలకలూరిపేటలో 2019 ఎన్నికల్లో మాత్రవే వైసీపీ గెలిచింది. ఈ ప్రాంతాలు టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాలు. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా టీడీపీ పైన మానసికంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైసీపీ కేడర్ లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని వైసీపీ నేతల విశ్లేషణ.

ఎన్నికల వరాల ప్రకటన: ఇక, ఈ సభలోనే సీఎం జగన్ ఎన్నికల వరాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. రైతురుణ మాఫీ పైన రాప్తాడు సభలోనే ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. అయితే, చివరి సభలో ప్రకటించటం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సభలో రైతు రుణమాఫీ, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం.
సిద్దం సభ వెంటనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక..ఈ సభ సమయానికి అభ్యర్దుల ఎంపిక పూర్తి చేసి..పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచన. దీంతో, ఈ సభకు ముందే ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలు అమలు..అభ్యర్దుల ప్రకటన పూర్తి చేయనున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications