నారాయణపై వైసీపీ మైండ్ గేమ్; ఎంపీ హాట్ కామెంట్స్ : అమరావతి ల్యాండ్ స్కామ్ లో ఆయన నిజంగానే బుక్కయ్యారా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల కుంభకోణం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతుంది. అమరావతి భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏపీ సిఐడికి భూముల అక్రమాలపై విచారణ బాధ్యతను అప్పగించిన విషయం తెలిసిందే. అప్పటినుండి అమరావతి భూముల అక్రమాల తీగ లాగుతున్న సీఐడీ అధికారుల దర్యాప్తు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు తప్ప, నిరూపించే ఆధారాలు తక్కువే అన్న భావన వ్యక్తం అవుతుంది. తాజాగా మళ్ళీ వైసీపీ నేతల ఆరోపణలతో ప్రధానంగా ఈ భూ కుంభకోణంలో మారోమారు నారాయణ పేరు తెరమీదకు వచ్చింది. నారాయణతో వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది.

ఆ ఐఏఎస్ అధికారి సాక్షిగా మారితే నారాయణకు ఉచ్చు బిగిసినట్టే !!
అమరావతిలో భూ కుంభకోణం విషయంలో గత ప్రభుత్వంలోని మంత్రులకు ఉచ్చు బిగిసేలా వైసిపి సర్కార్ రంగంలోకి సీఐడీ అధికారులను దించి సమగ్ర దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి ప్రకటనకు ముందే అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఆరోపణలు, అలాగే నాడు సిఆర్డిఏ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఇచ్చిన సమాచారంతో కేసు కొత్త మలుపు తిరిగిందని సమాచారం. సీఐడీ అధికారుల దర్యాప్తు తుది దశకు చేరుకున్న సమయంలో నాడు తెలుగుదేశం పార్టీ హయాంలో మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణకు ఉచ్చు బిగుస్తుంది అన్న సంకేతాలను ఇస్తున్నారు వైసీపీ నాయకులు.

నారాయణను టార్గెట్ చేస్తున్న ఆర్కే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఇటీవల ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల నుండి భూముల కొనుగోలు వ్యవహారంలో అప్పట్లో మంత్రిగా ఉన్న నారాయణ కీలక పాత్ర పోషించారని చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కసారిగా నారాయణపై పడింది. ఇదే సమయంలో అమరావతి సిఆర్డిఏ అక్రమ వ్యవహారాల్లో మాజీ మంత్రి నారాయణ అడ్డంగా దొరికిపోయాడు. ఆయన అప్రూవర్ గా మారకుండా ఏం తాయిలం ఇస్తావు బాబు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేస్తూ అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ కుంభకోణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రెవెన్యూ రికార్డుల మాయం వెనుక నారాయణ హస్తం ?
నారాయణ 2015 ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టే ముందే 2014 లోనే తుళ్లూరు మండలం భూ రికార్డులను రహస్యంగా తప్పించుకున్నారని అప్పటి సిఆర్డిఏ కమిషనర్ గా పనిచేసిన ఐఏఎస్ అధికారి చెప్పినట్టు సమాచారం. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు ముందే రెవెన్యూ రికార్డులు మాయమయ్యాయని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి అయిన ఓ ఐఏఎస్ అధికారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు గా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను చేపట్టడం అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ పర్యవేక్షించారని, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో అసైన్డ్ భూములను తీసుకునే సమయంలో ఏపీ అసైన్డ్ యాక్ట్ 1977 కు విరుద్ధంగా ఉన్న అంశాలను నాటి మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి నప్పటికీ నారాయణ పట్టించుకోలేదని ఐఏఎస్ అధికారి సిఐడి అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది.

అక్రమాలకూ పాల్పడ్డ వారెవరూ తప్పించుకోలేరన్న సాయిరెడ్డి
ఈ క్రమంలోనే రాజధాని భూముల కుంభకోణం నారాయణ మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు .అమరావతి స్కాం లో చంద్రబాబు ఆయన అండదండలతో అక్రమాలకు పాల్పడ్డ వారు ఎవరూ తప్పించుకోలేరు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, వ్యవస్థలో తనకున్న పలుకుబడితో కొన్నాళ్లు సాగదీయగలరేమో కానీ లక్షల కోట్ల కుంభకోణం నుంచి బయటపడ్డ మాత్రం అసాధ్యమంటూ నారాయణ ను టార్గెట్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ముందే సమాచారం లీక్ చేయడం, రికార్డులను ధ్వంసం చేయడం అత్యంత దారుణం అంటూ విమర్శించారు .

నారాయణ అప్రూవర్ గా మారకుండా ఏం తాయిలం ఇస్తావు బాబూ ? సాయిరెడ్డి సెటైర్
ఇదే సమయంలో ఈఎస్ఐ స్కాం లో అచ్చెన్నాయుడు దొరికితే, ఆయన నోరు విప్పితే ఎక్కడ దొరికి పోతామో అన్న భయంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆఖరి నిమిషంలో రామ్మోహన్ నాయుడు పేరును తొలగించి, అచ్చెన్న కు పదవి కట్టబెట్టారు. ఆ పదవి కారణంగా అచ్చెన్న అప్రూవర్ గా మారలేదు. ఇప్పుడు సిఆర్డిఏ అక్రమ వ్యవహారాల్లో మాజీ మంత్రి నారాయణ అడ్డంగా దొరికాడు.ఆయన అప్రూవర్ గా మారకుండా ఏం తాయిలం వేస్తావు బాబు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు ని టార్గెట్ చేశారు.

భూ కుంభకోణంలోనారాయణ ఉన్నట్టు నిరూపిస్తారా ?
ఏది ఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతి లో భూ కుంభకోణం జరిగిందని అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఉన్నారని ఆరోపణలు గుప్పిస్తోంది. మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ పేరును కూడా పదే పదే ప్రస్తావిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సైలెంట్ గా రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణను సైతం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.నారాయణతో మైండ్ గేమ్ ఆడుతూ భయపెడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును టెన్షన్ పెడుతున్నారు. నారాయణను ఈ స్కామ్ లో ఉన్నట్టు చూపించే ప్రయత్నంలో వైసీపీ ఏ మాత్రం సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications