రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి టూర్ తో పవన్ కళ్యాణ్ కు షాక్? ఆ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, నేతలు; ఉత్కంఠ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ విక్రయాలపై ఏపీ సర్కార్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీ మంత్రులు మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఇక ఆ తరువాత జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒంటరివాడని, అటు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు సొంత అన్న చిరంజీవి కూడా పవన్ చర్యలను సమర్థించడం లేదని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే పని మొదలుపెట్టారు. ఏకంగా మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని చెప్పడం అందుకు ఊతమిస్తుంది.

పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్ళ దాడికి భయపడను; చిరంజీవి జోక్యం చేసుకోవాలన్న పోసానిపవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్ళ దాడికి భయపడను; చిరంజీవి జోక్యం చేసుకోవాలన్న పోసాని

చిరంజీవి పర్యటనలో వైసీపీ నేతలు .. ఏపీలో హాట్ టాపిక్

చిరంజీవి పర్యటనలో వైసీపీ నేతలు .. ఏపీలో హాట్ టాపిక్

తాజాగా మరో ఆసక్తికర సందర్భం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటుంది. రోజు చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు నేతలు పాల్గొననుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఒక పక్క చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరో పక్క చిరంజీవి పాల్గొననున్న ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరు కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం

అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం


ఈరోజు రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో చిరంజీవి పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న చిరంజీవి మధ్యాహ్నం సమయంలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు భార్య సురేఖ అల్లు అరవింద్ తదితరులు పాల్గొననున్నారు .ఇక ఈ విషయాన్ని అల్లు రామలింగయ్య హోమియో కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడించారు.

చిరంజీవితో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

చిరంజీవితో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు

చిరంజీవి పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చిరంజీవి పర్యటనలో మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఈరోజు చిరంజీవితో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు గోపాల రావుతోపాటు ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, వైసిపి నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క చిరంజీవి సోదరుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తూ, మరో పక్క మెగాస్టార్ చిరంజీవితో పాటు వైసీపీ నేతలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననుండటం జనసేన వర్గాలకు మింగుడు పడలేదు.

చిరంజీవి పర్యటన పవన్ కు షాక్ ఇస్తుందా ? ఏం జరుగుతుంది?

చిరంజీవి పర్యటన పవన్ కు షాక్ ఇస్తుందా ? ఏం జరుగుతుంది?

చిరంజీవి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు, వైసీపీ నేతలతో చిరంజీవికి ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పడం కోసమే వైసీపీ నేతలు చిరంజీవి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్ కు షాక్ అనే చెప్పాలి . ఏది ఏమైనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి పర్యటన, అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొననుండడం చర్చనీయాంశంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ పోసాని వ్యవహారంతో పాటుగా తాజా పరిణామాలపై ఈ రోజు కార్యక్రమంలో చిరంజీవి స్పందిస్తారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

English summary
chiranjeevi tour creating tension in AP. Ministers, Kannababu, Pinipe Vishwaroop, Venu Gopala Rao, YCP MPs and MLAs are expected to attend the unveiling of the bronze statue of Alluramalingaiah in Rajahmundry. It should be said that this is a shock to Pawan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X