పవన్‌కు జగన్ మీద కామెంట్ చేసే స్థాయిలేదు..! డిపాజిట్లు కూడా రానిపార్టీ జనసేన: ఎమ్మెల్యే సిద్ధారెడ్
Recommended Video
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం జగన్ తో సాధ్యం కాదని , జగన్ పై కేసులు కనుక లేకపోతే, ఆయన తిరిగే వారు కాదని, కూర్చునే రాజకీయం చేసేవారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తల నిమరటాలు, ముద్దులు పెట్టడాలు రావని జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా చురకలు వేశారు.

పవన్ కళ్యాన్ పై మండిపడుతున్న వైసీపీ నేతలు .. జగన్ ను అనే అర్హత ఉందా అంటూ మండిపాటు
జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు . పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత కాస్తో కూస్తో ఉన్న జ్ఞానం కూడా పోయినట్టు ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. వైసిపి కదిరి ఎమ్మెల్యే వెంకట సిద్ధారెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో అసలు డిపాజిట్లు కూడా దక్కించుకో కుండా ఘోరంగా ఓడిపోయిన జనసేన పార్టీ నేతలు కూడా మాట్లాడేవారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని విమర్శించారు. అసలు ఏ అర్హతతో జగన్ గురించి మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించిన వైసిపి నేత భీమవరం, గాజువాకలలో రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని ఎద్దేవా చేశారు. పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.
జనసేన తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గెలిస్తే ఆయనకు కూడా పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని సిద్ధారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం అవుతుందని అనుకుంటే ఉన్నది కూడా పోయినట్లుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధారెడ్డి. ఇక ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

వైసీపీ నేతలకు పవన్ పై ఎదురు దాడికి గత ఎన్నికల్లో ఓటమి అస్త్రం
తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఒకవేళ జగన్ ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే వైసీపీ నేతలకు పవన్ ను టార్గెట్ చేయడానికి దొరికిన ఒకే ఒక అస్త్రం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావడం. జనసేన పార్టీ నుండి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే విజయం సాధించడం.. 140 మంది పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం .. ఇక వీటిని ప్రధానంగా టార్గెట్ చేసి వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications