టిలో నష్టపోయినా: భూమన, సస్పెండ్ చేయాలి: హరీష్

హైదరాబాద్: తాము తెలంగాణ ప్రాంతంలో నష్టపోయినా సమైక్య సిద్ధాంతాన్ని ఎత్తుకున్నామని చిత్తూరు జిల్లా తిరుపతి శాసన సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బిఎసి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతోనే రాష్ట్ర విభజన జరుగుతోందన్నారు. తాము ఓ ప్రాంతంలో నష్టపోయినా సమైక్యమంటున్నామన్నారు. చంద్రబాబు రెండు ప్రాంతాల్లో ఉండాలనుకుంటున్నారు తప్ప సమైక్యం అనడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో సమైక్యంపై తీర్మానం చేస్తేనే తాము తెలంగాణ ముసాయిదా బిల్లుకు సహకరిస్తామన్నారు.

 Bhumana Karunakar Reddy

ప్రతి క్లాజు పైన ఓటింగ్: జెపి

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో ప్రతి క్లాజు పైన ఓటింగ్ ఉండాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.

బాబు అందరివాడు: మోత్కుపల్లి

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందరివాడని టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. చంద్రబాబు లేఖ ఇవ్వకుండానే కేంద్రం తెలంగాణ ఇచ్చిందా అని ప్రశ్నించారు. పార్టీలు ప్రాంతాల వారీగా చీలిపోయాయన్నారు. బిల్లుపై చర్చకు అందరూ సహకరించాలని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు.

స్పీకర్ చెబుతారు: జూలకంటి

రేపటి నుండి శుక్రవారం వరకు చర్చ జరిపి మిగతా చర్చ ఎప్పుడనేది స్పీకర్ నిర్ణయిస్తారని జూలకంటి రంగారెడ్డి చెప్పారు. బిల్లుపై ఓ ప్రాంతం వారు మాట్లాడుతుంటే మరో ప్రాంతం వారు అడ్డుకోకుండా చూడాలన్నారు. బిల్లుపై చర్చను అడ్డుకోకుండా చూడాలని గూండా మల్లేష్ అన్నారు.

అడ్డుకుంటే వచ్చేది లేదు: హరీష్ రావు

తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవడం ద్వారా వచ్చేదేమీ ఉండదని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కుటుంబ సభ్యులపై ఆరోపణలను తాను ఖండిస్తున్నానన్నారు. జగన్ పార్టీ సమైక్యాంధ్రపై తీర్మానం చేయాలని కోరడం విడ్డూరమన్నారు. సభను అడ్డుకునే వారిని సస్పెండ్ చేయాలన్నారు.

సభను అడ్డుకోవద్దు: ఈటెల

సభను ఎవరూ అడ్డుకోవద్దని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ అన్నారు. చర్చలో ఎవరికైనా అనుమానాలు ఉంటే చెప్పుకోవచ్చునన్నారు. ఓటింగు కోరే అవకాశముండదని, సభ్యుల అభిప్రాయం మాత్రమే తీసుకుంటారన్నారు. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈటెల అన్నారు. సజావుగా సభ సాగేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లుపై చర్చను కొనసాగించాలని బిఎసి నిర్ణయం తీసుకుందన్నారు.

అడ్డుకోవడం ద్వారా స్ధించేది లేదు, అనుమానులు చర్చలో చెప్పుకోవచ్చు, హరీళష్, కుటుంబసభ్యులపై ఆరోపణలు ఖండిస్తున్నా,
సభను అడ్డుకోవద్దు, ఈఠెల, ఓటింగు కోరే అవకాశం లేదు, సభ్యుల అభిప్రాయం మాత్రమే తీసుకోవాలి, బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు, సజావుగా సాగేలా స్పీకర్ చర్యలు, బిల్లుపై చర్చ కోనసాగించాలని బిఏసి నిర్ణయం,

రెచ్చగొట్టడమే: కోదండరామ్

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించడం ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టడమేననని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ మెదక్ జిల్లాలో అన్నారు. బిల్లుకు సహకరించని పార్టీలు తెలంగాణలో మట్టికొట్టుకుపోతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+