చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు: 'రోజాకు ఏమైనా జరిగితే ఆయనదే బాధ్యత'
హైదరాబాద్: ఏపీ శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏమైనా జరిగితే సీఎం చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.
ఏపీ శాసనసభ నుంచి శుక్రవారం రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేశారని, ఈ రోజు అరెస్ట్ చేయించి నిమ్స్‌కు తరలించేలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఓ మహిళ ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

అధికారం చేతిలో ఉందని అధికారపక్షం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో సీఎం సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు విలువలు వదిలేసి దిగజారుడు మాటటు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ని సైతం నీచంగా విమర్శిస్తున్నారని, అధికార పార్టీ సభ్యులు తిడుతుంటే చంద్రబాబు సంతోషంతో నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అణగదొక్కేందుకు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications