పవన్ ఎంటీ ఖర్మ ? అందుకే పిఠాపురంలో పోటీ ! ద్వారంపూడి కౌంటర్..
ఏపీలో సీఎం వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం సీట్ల కంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ సీటు చుట్టే ఈసారి రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో గెలిచి ఎన్నికల్లో బోణీ కొడతారా లేదా అన్న చర్చ జరుగుతుంటే మరోవైపు ఆయన్ను ఎలాగైనా ఓడించేందుకు సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిన్న ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి తన గెలుపు ఖాయమైపోయిందని, లక్ష మెజార్టీపైనే ఇప్పుడు చర్చ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్ని ఎక్కడో తాకాయి. దీంతో పిఠాపురంలో పవన్ ప్రత్యర్ధిగా పోటీ చేస్తున్న వంగా గీతతో పాటు వైసీపీ నేతలంతా వరుసగా స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ అంటేనే మండిపడే కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు.

పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. వీడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పోటీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఈసారి పవన్ ను కాపులే ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. పవన్ పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారన్నారు. పవన్ ఎలాంటి వాడో కాపులకు తెలుసని, వారు తెలివైన వాళ్లని ద్వారంపూడి చెప్పుకొచ్చారు. కాపులు ఎట్టిపరిస్దితుల్లోనూ పవన్ ను గెలిపించరన్నారు. కాబట్టి పిఠాపురంలోనూ పవన్ ఓడిపోవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications