జగన్‌కు షాక్: నారా లోకేష్‌తో వైసిపి ఎమ్మెల్యే భేటీ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీ శాసనసభ్యులు, నాయకులు ఒక్కరొక్కరే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. లేదా బిజెపిలోకి వెళ్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు శాననసభ్యుడు పాశం సునీల్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పాశం సునీల్ తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. చిల్లకూరులోని టీడీపీ నేత నానాజీ ఇంటికి వచ్చిన లోకేష్‌కు సునీల్ పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి భేటీ అయ్యారు. గంటకుపైగా వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీరి భేటీపై సర్వత్రా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోదరుడి కుమారుడి వివాహానికి ఆ పార్టీ యువనేత నారా లోకేష్ హాజరయ్యారు. లోకేష్‌తోపాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీతల సుజాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే సునీల్ నారా లోకేష్‌ను కలిశారు.
పాశం సునీల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానే ఊహాగానాలు లోకేష్ భేటీతో ఊపందుకున్నాయి. నిజానికి, నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాస్తా బలంగా ఉంది.












Click it and Unblock the Notifications