"బాబు కనుసన్నుల్లోనే టీడీపీ దౌర్జన్యం.. ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి మానభంగం"

సీఎం చంద్రబాబు కనుసన్నుల్లోనే ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు.

కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నిక రసాభాసగా మారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల దౌర్జన్యపూరిత వైఖరితోనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్ రెడ్డి.. సీఎం చంద్రబాబు కనుసన్నుల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు.

ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నాయకులు మానభంగం చేశారని రాచమల్లు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పోలీసులు సైతం టీడీపీ నేతల దౌర్జన్యాన్ని చూసీ చూడనట్లుగా వదిలేశారని అన్నారు. ఒక్కో కౌన్సిలర్ ను రూ.50లక్షలతో కొనేందుకు జిల్లాకు చెందిన ఒక మంత్రి సిద్దపడ్డారని ఆయన ఆరోపించారు.

ysrcp mla rachamallu sivaprasad reddy allegations on chandrababu over muncipal chairman elections

మంత్రి గారి ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగనందు వల్లే మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని రాచమల్లు మండిపడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారని, తమపై సైతం దాడికి పాల్పడ్డారని దేవినేని ఆరోపించారు. టీడీపీ నేతల కుయుక్తులు తనను బాధించాయని, ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుందో తెలియడం లేదన్నారు.

కాగా, టీడీపీ నేతల దౌర్జన్యంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఆదివారం నాడు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అవసరమైన బలం లేకపోవడంతోనే అధికార టీడీపీ మరో హైడ్రామాకు తెరలేపిందని అన్నారు. చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు అవసరమైనంత మంది కౌన్సిలర్ల బలం తమకున్నా.. అధికార పార్టీ దౌర్జన్యానికి దిగిందని ఆరోపించారు. ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+