చిత్తూరు జిల్లా వైసీపీ పెద్ద తలకాయనే టార్గెట్ చేశారా?: రోజా ఘాటు వ్యాఖ్యల ఆంతర్యమేంటీ?

చిత్తూరు: చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా.. మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించడానికి సొంత పార్టీ నేతలే కుట్ర పన్నారంటూ 2019 నాటి ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించిన ఆమె.. అదే తరహాలో మళ్లీ విమర్శలు గుప్పించారు. తన సొంత నియోజకవర్గం నగరిలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. సొంత పార్టీ నేతలపై రోజా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.

సొంత పార్టీకే చెందిన కొందరు నాయకులు తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ వార్డులను ఏకగ్రీవం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలను చేశానని, కొందరు వైసీపీ నేతలే వాటిని అడ్డుకున్నారని ఆరోపించారు. తన అనుచరులు పోటీ నుంచి తప్పుకొన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలు తిరుగుబాటు అభ్యర్థులను పోటీలో నిలిపారని, దీనికోసం భారీగా డబ్బులను పంచారని అన్నారు. ఏకగ్రీవాల కోసం శ్రమించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు.

 YSRCP MLA Roja allegedly comments on her own party leaders

2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రయత్నించిన వారే తాజాగా మళ్లీ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఏకంగా 14 మంది తిరుగుబాటు అభ్యర్థులను పోటీకి నిలిపారని విమర్శించారు. పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సహకరిస్తున్నారని, సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దుతున్నారని ఘాటుగా విమర్శించారు. జిల్లా రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని తాను ఇదివరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+