అవి చంద్రబాబు భజన కార్యక్రమాలు: ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం లేదన్న రోజా

అమరావతి: 'నా నియోజక వర్గంలో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం పంపలేదు' అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తనకు ఆహ్వానం లేకపోయినా, ఎమ్మెల్యే హోదాలో తిరుపతిలోని విజయపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో రోజా పాల్గొన్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. నవ నిర్మాణ దీక్షలు కేవలం చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారాయిపోయాయని ఆమె విమర్శించారు.

గతంలో ఒక్క హైదరాబాద్ పైనే చంద్రబాబు దృష్టి పెట్టారని, ఇప్పుడు కూడా అదేవిధంగా అమరావతి పేరుని జపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలా చేయడం సరికాదని, అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని విమర్శించారు.

Ysrcp mla Roja criticises ap cm chandrababu naidu nava nirmana deeksha

ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల నేతలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె కోరారు.

'అనంత'లో అల్లర్లు సృష్టించిన అరాచకవాది జగన్: ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌ను రావణ కాష్టంగా మార్చడమే వైయస్ జగన్ ముందున్న లక్ష్యమని వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథ్ రెడ్డిలు నిప్పులు చెరిగారు. సోమవారం మీడియాతో మాట్లాడిన వీరు ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో తన రైతు భరోసా యాత్రతో జగన్ అల్లర్లు సృష్టించిన అరాచకవాదిగా పేర్కొన్నారు.

జగన్‌కు మతిభ్రమించిందని, సైకోలా మాట్లాడుతున్నాడని, ప్రతిపక్ష నేతగా అనర్హుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలను జగన్ వర్గీయులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సూచించారు. జగన్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే రోజు త్వరలోనే వస్తుందని వారు జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+