వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూసుకుందాం రా! ముసలోడ్ని పట్టుకోలేక: రోజా ఆగ్రహం, టీడీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు గుండు కొట్టిస్తానని టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. బండారుపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విశాఖలో పాదయాత్ర నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా మాట్లాడారు.

దాచేపల్లి బాధితురాలి వద్దకు సీఎం: నన్నపనేని కంటతడి, ఖబడ్దార్ అని హెచ్చరికదాచేపల్లి బాధితురాలి వద్దకు సీఎం: నన్నపనేని కంటతడి, ఖబడ్దార్ అని హెచ్చరిక

తాను ప్రస్తుతం బండారు సత్యనారాయణ నియోజకవర్గంలోనే ఉన్నానని గుర్తు చేశారు. నీ ఏరియాకే వచ్చానని, దమ్ముంటే ఇక్కడికి రా..ఎవరు గుండు కొట్టించగలరో చూసుకుందామని సవాల్ చేశారు. మహిళలపై పాశవికంగా దాడి చేయించిన ఘటనను ఇంకా ఎవరూ మరచిపోలేదన్నారు. బండారుకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే రానుందన్నారు.

మా పోరాటం వల్లే దాచేపల్లి కుటుంబానికి న్యాయం

మా పోరాటం వల్లే దాచేపల్లి కుటుంబానికి న్యాయం

చంద్రబాబు అసమర్థత పాలన వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాల జరుగుతున్నాయని రోజా అన్నారు. ఆయన ఏదైనా బావిలో దూకాలన్నారు. మహిళలపై దాడుల ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. దాచేపల్లి ఘటనపై వైసీపీ పోరాటం కారణంగానే ఆ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.

నిందితుడిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు

నిందితుడిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారు

దాచేపల్లి ఘటనలో పది కిలో మీటర్ల పరిధిలో ఉన్న నిందితుడిని ప్రాణాలతో పట్టుకోలేకపోయారని రోజా మండిపడ్డారు. ఇదీ పోలీసు వ్యవస్థ పని తీరు అన్నారు. మత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, చింతమనేని, బండారు, పయ్యావుల కేశవ్‌లు మహిళలపై దాడులు చేశారని ఏడీఆర్ కమిటీ నివేదిక ఇచ్చినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

మహిళలకు రక్షణ లేదని చెప్పేందుకు ఇదే నిదర్శనం

మహిళలకు రక్షణ లేదని చెప్పేందుకు ఇదే నిదర్శనం

రాష్ట్రంలో 2014, 2016 మధ్య మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగాయని రోజా అన్నార. మహిళలకు రక్షణ లేదని చెప్పేందుకు గత మూడేళ్ల గణాంకాలు చాలన్నారు. చంద్రబాబుకు సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆదాయం కోసం ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు ఏర్పాటు చేశారని, వాటివల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని, తక్షణమే మధ్య నిషేధం అమలు చేయాలన్నారు.

ముసలివాడిని పట్టుకోలేకపోయారు, సిగ్గులేదా

ముసలివాడిని పట్టుకోలేకపోయారు, సిగ్గులేదా

అమెరికాలో దాడి జరిగితే చంద్రబాబు ఖండిస్తారని, జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఘటనకు ప్రధాని బాధ్యత వహించాలని చెప్పే చంద్రబాబు రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే బాధ్యత వహించరా అని ప్రశ్నించారు. ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. 55 ఏళ్ల ముసలివాడిని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని, సిగ్గుందా అని రోజా ప్రశ్నించారు.

 రోజాపై తీవ్ర వ్యాఖ్యలు

రోజాపై తీవ్ర వ్యాఖ్యలు

దాచేపల్లి ఘటన నేపథ్యంలో చంద్రబాబు, మహిళా మంత్రులు, పోలీసులపై రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఖండించారు. రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉందని, ఆమె ఒక బరితెగించిన మహిళ అన్నారు. ఒక శాసనసభ్యురాలై ఉండి నన్ను దమ్ముంటే రేప్ చేయండని మాట్లాడిన వ్యక్తి అన్నారు. అటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య వైసీపీకి చెందిన వ్యక్తి అన్నారు. ప్రతిపక్షంలో ఉండి అకృత్యాలకు పాల్పడటం, అత్యాచారాలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం దారుణమన్నారు. వైసీపీకి గానీ, రోజాకు గానీ ఏ సంఘటన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దాచేపల్లి సంఘటనలో ముందుగా బాధిత బాలికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలన్నారు.

English summary
YSRCP MLA Roja slams Andhra Pradesh Chief Minister Chandrababu Naidu over dachepalli incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X