వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే హక్కుల పునరుద్ధరణ!: రోజా లాయర్.. ఎవరీ ఇందిరా జైసింగ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైసిపి ఎమ్మెల్యే రోజాను ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెండ్ చేసింది. దీనిపై రోజా సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టులో ఆమెకు గురువారం నాడు ఊరట లభించింది. రోజా తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ బలమైన వాదనలు వినిపించారు.

హైకోర్టులో రోజాకు అనుకూలంగా తీర్పు రావడంపై ఇందిరా జైసింగ్ స్పందించారు. ఎమ్మెల్యే రోజా నియోజకవర్గ ప్రజలకు ఇది గొప్ప విజయం అన్నారు. రాజ్యాంగం మరోసారి వర్దిల్లిందన్నారు. నాలుగు వారాల తర్వాత తుది విచారణ చేస్తారని ఆమె చెప్పారు.

హైకోర్టు మధ్యంతర తీర్పు పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగం ఏం చెబుతుందన్న దాని పైన మరోసారి స్పష్టత వచ్చిందన్నారు. సరైన వేదిక పైన ఎమ్మెల్యేకు ఉన్న హక్కులు మరోసారి పునరుద్ధరింపబడ్డాయన్నారు. ఇది మధ్యంతర ఉత్తర్వు అని చెప్పారు. రాజ్యాంగం పట్ల మరోసారి విశ్వసనీయత బయటపడిందన్నారు.

YSRCP MLA Roja suspension case: Who is indira jaising?

పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈ రోజు అసెంబ్లీకి వెళ్లవచ్చునని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా ఈవాళే ఉత్తర్వులు వెళ్లనున్నాయని రోజా తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ చెప్పారు.

ఎవరీ ఇందిరా జైసింగ్?

ఇందిరా జైసింగ్ సుప్రీం కోర్టు న్యాయవాది. ఈమె ప్రధానంగా మానవ హక్కులు, ఫెమినిజం విషయమై పోరాడుతుంటారు. ఇందిరా జైసింగ్ 1940లో ముంబైలో జన్మించారు. ముంబైలోనే చదివారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ సంపాదించారు. యునివర్సిటీ ఆఫ్ బాంబేలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు.

1986లో బాంబే హైకోర్టులో సీనియర్ అడ్వోకేట్‌‌గా నియమించబడ్డారు. ఇక్కడ తొలి మహిళ ఈమే. ఆమె ప్రతిభ సోనియా గాంధీకి ప్రియం అయ్యేలా చేసింది. 2009లో తొలి మహిళా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు. ఈమె మానవ హక్కులు, మహిళా హక్కుల గురించి పోరాడుతారు.

భూపాల్ విషాద బాధితుల తరఫున వారికి పరిహారం కోసం ఈమె సుప్రీం కోర్టులో పోరాడారు. ముంబైలో పలువురు బాధితుల తరఫున ఆమె పోరాడారు. పేవ్‌మెంట్ నిరాశ్రయుల తరఫున పోరాటం చేశారు. ఎన్నో పర్యావరణ కేసులు వాదించారు. ఈమె లాయర్స్ కలెక్టివ్ ఫౌండర్ సెక్రటరీ. 1986లో మంత్రీ మేగజైన్ దిలాయర్స్‌ను ప్రారంభించారు.

మహిళల పట్ల వివక్ష, ముస్లీమ్ పర్సనల్ లా, పేవ్‌మెంట్ నిర్వాసితుల హక్కులు, ఇళ్లు కోల్పోయిన వారి తరఫున, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ బాధితుల తరఫున పలు కేసులలో ఆమె వాదించారు. చైల్డ్ లేబర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. డొమెస్టిక్ వయోలెన్స్ పైన పోరాడారు.

English summary
YSRCP MLA Roja suspension case: Who is indira jaising?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X