Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీలో చేరికపై వసంత ప్రకటన ! ఉమతో శతృత్వంపై కీలక వ్యాఖ్యలు...!

ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విపక్ష టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమవుతోంది. నిన్న చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన వసంత.. మైలవరం సీటుపై హామీ తీసుకున్నారు. చంద్రబాబు ఇవాళ్టి నుంచి నియోజకవర్గంలో పనిచేసుకోవాలని చెప్పారని వసంత నిన్ననే ప్రకటించారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చేశారు.

వచ్చే రెండు, మూడు రోజుల్లో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ టీడీపీలో వసంత చేరికపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. టీడీపీలో చేరి తిరిగి మైలవరం సీటు నుంచే పోటీ చేయబోతున్నట్లు వసంత వెల్లడించారు. తనతో పాటు వైసీపీలో అనుచరులుగా ఉన్న వారంతా టీడీపీలో చేరతారని ఆయన పేర్కొన్నారు.

ysrcp mla vasantha krishna prasad confirmed joining tdp, interesting comments on rival devineni uma

అలాగే ఇన్నాళ్లూ తనకు రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో శత్రుృత్వంపైనా వసంత కృష్ణప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీలో చేరి తిరిగి దేవినేని ఉమతో పనిచేయాల్సి రావడంపై స్పందిస్తూ.. ఆయనతో తనకు ఉన్నది ఆస్తి తగాదానో, మరో తగాదానో కాదని కేవలం రాజకీయ పరమైన విభేదాలనే అని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఉమతో పాటు టీడీపీలో నేతలందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవాళ్టి నుంచి మైలవరంలో ప్రచారం కూడా మొదలుపెట్టేసిన వసంత.. రెండు రోజుల్లో టీడీపీలో అధికారికంగా చేరబోతున్నారు. ఆ తర్వాత ఆయనకు టీడీపీ రెండో జాబితాలో సీటు కేటాయించనున్నారు. మరోవైపు మైలవరంలో సీటు దక్కని దేవినేని ఉమకు చంద్రబాబు ఏం ప్రత్యామ్నాయం చూపించబోతున్నారన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+