ఎలా చెప్పారో అర్థం కాలేదు: చంద్రబాబు 'స్వాగత' వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు

అమరావతి: ఏపీకి ఆర్ధిక సాయంపై క్లారిటీ ఇవ్వని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పబడుతున్నారు. కాగా, వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది.

అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లేలా జైట్లీ ప్రకటన వచ్చిందని, ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు సిగ్గులేకుండా ఎలా చెప్పారో అర్థం కాలేదని అన్నారు.

ఇప్పుడు రాష్ట్రానికి హోదా లేకుండా చేశారని, కనీసం ప్యాకేజీ కూడా ఇవ్వలేదని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏమీ రావని ఆమె అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు కావాల్సింది హోదాయేనని, అందుకోసం ఎంతవరకైనా పోరాడతామని ఆమె అన్నారు.

ysrcp mlas fires over chandrababu welcome statement

ఇందులో భాగంగానే అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. ఏపీకి హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, దాని కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మరో ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. హోదా వచ్చేవరకు పార్టీలకు అతీతంగా అందరం పోరాడాలని కోరుతున్నామని అన్నారు.

తనకు ముఖ్యమంత్రి హోదా ఉంది కదా అని 5 కోట్ల మంది ఆంధ్రులకు దక్కాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెట్టారని, ఇది చీకటి రోజు కాబట్టే తామంతా నల్ల దుస్తులతో వచ్చామని మరో మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు, దాని నుంచి బయటపడేందుకే ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+