అమరావతి: జగన్ వెళ్లలేదు.. షాకిచ్చిన నలుగురు సొంత ఎమ్మెల్యేలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాజధాని అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా నగరం (అడ్మినిస్ట్రేటివ్ సిటీ) నమూనాపై శనివారం ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జగన్ వెళ్లేందుకు సుముఖత చూపలేదు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు హాజరయ్యారు.

ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్పందన కనిపించింది. జగన్‌ తాను అక్కడకు వెళ్లనంటూ తన రూంకే పరమితమయ్యారు. ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అధినేత వెళ్లనన్న చోటుకు వెళ్లడం గమనార్హం.

రాజధాని అమరావతిలో శాశ్వత ప్రాతిపదిక నిర్మించనున్న పరిపాలనా నగరం నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి, వాటిపై వారి అభిప్రాయాలనూ తీసుకోవాని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రజెంటేషన్

ప్రజెంటేషన్

ఈ మేరకు శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రత్యేకంగా వీరికోసం ప్రజంటేషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి ప్రజంటేషన్‌ ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి బయల్దేరారు.

సభా సమయం వృథా అని జగన్

సభా సమయం వృథా అని జగన్

ఆ సమయంలో సభ నుంచి బయటకొచ్చిన జగన్‌ నేరుగా తన ఛాంబర్ వైపు వచ్చారు. ప్రజంటేషన్‌కు వెళ్లట్లేదా అని అక్కడున్న విలేకరులు ఆయనను అఢిగారు. మూడేళ్ల సమయం గడచినా రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఎవరిని మోసం చేయడానికి మళ్లీ ఇప్పుడు ఈ ప్రదర్శనలు అని, ఈ పేరుతో సభా సమయాన్ని వృథా చేయడమేనని వ్యాఖ్యానించారు.

డైలమాలో ఎమ్మెల్యేలు

డైలమాలో ఎమ్మెల్యేలు

మీరు హాజరవరా? అని మరో విలేకరి ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి చేసేది ఏమిటని జగన్ ఎదురు ప్రశ్నించి.. తన గదిలోకి వెళ్లారు. అదే సమయంలో వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు ప్రజంటేషన్‌కు వెళ్లాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు.

ప్రజెంటేషన్‌కు వైసిపి ఎమ్మెల్యేలు

ప్రజెంటేషన్‌కు వైసిపి ఎమ్మెల్యేలు

స్పష్టత లేకపోవడంతో కొందరు ఆగిపోగా, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ పై అంతస్తులో ఏర్పాటు చేసిన ప్రజంటేషన్‌కు హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు బయల్దేరి మళ్లీ ఆగిపోయారు.

జగన్‌ను కలిశారు

జగన్‌ను కలిశారు

ప్రజంటేషన్‌ ముగిశాక అక్కడకు వెళ్లిన నలుగురు ఎమ్మెల్మేల్లో ఇద్దరు జగన్‌ వద్దకు వెళ్లి కలిశారు. ప్రజంటేషన్‌లో ఇచ్చిన పత్రాలను, వాటి గురించి అక్కడ వెల్లడించిన అంశాలను ఆ ఎమ్మెల్యేలు జగన్‌కు వివరించారు. వెంటనే వాటిపై మీడియాతో మాట్లాడాలని ఓ ఎమ్మెల్యే మీడియా పాయింట్ వద్దకు వెళ్లారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party MLAs join in Administrative City plan in Amaravati Assembly on Saturday morning.
Please Wait while comments are loading...