వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్‌పై జేసీ తీవ్ర వ్యాఖ్యల వెనుక.., వైసిపి ఎమ్మెల్యేకు మైక్ ఎందుకివ్వలేదు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైన వైసిపి నేతలు వరుసగా మండిపడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైన వైసిపి నేతలు వరుసగా మండిపడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేసీ ఎప్పుడూ నా వెంట పడతారు: బాబు ఆసక్తికరం, 'అందుకే జగన్‌ని వాడు అంటాను'జేసీ ఎప్పుడూ నా వెంట పడతారు: బాబు ఆసక్తికరం, 'అందుకే జగన్‌ని వాడు అంటాను'

ఆ తర్వాత, విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలు కూడా దుమ్ము దులిపారు. జేసీ దివాకర్ రెడ్డి మానసిక పరిస్థితి బాగా లేదన్నారు. ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

jc diwakar reddy

చంద్రబాబు మెప్పు కోసమే జేసీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు మతిస్థిమితం తప్పిందన్నారు. తమ అధినేత వైయస్ జగన్ పైన నోరు జారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

జేసీ దివాకర్ రెడ్డి ఓ ఊసరవెల్లి అన్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు వెళ్తారన్నారు. జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం పొందుతున్నారని విమర్శించారు.

జగన్ ఎవరు చెప్పినా వినరు, అందుకే ఇలా చేశా: భూమా నాగిరెడ్డిజగన్ ఎవరు చెప్పినా వినరు, అందుకే ఇలా చేశా: భూమా నాగిరెడ్డి

వైసిపి ఎమ్మెల్యేకు మైకు ఎందుకివ్వలేదు

కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో దళిత ఎమ్మెల్యే ఐజయ్యకు మైకు ఇచ్చేందుకు చంద్రబాబు ఎందుకు భయపడ్డారో చెప్పాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబే అన్నారు.

English summary
YSRCP MLAs lashed out at JC Diwakar Reddy for targetting YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X