తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేల క్యూ.. జగన్ ప్రసన్నం కోసం యత్నాలు.. కానీ జరుగుతుందిదే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వివిధ నియోజకవర్గాలలో ఇన్చార్జులను మారుస్తూ, చాలామంది ఎమ్మెల్యేలకు నేరుగా టికెట్ లేదని ప్రకటిస్తూ, సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో వైసీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో నేరుగా అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి పరుగులు పెడుతున్నారు.

ఇక తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లికి వైసిపి ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. నియోజకవర్గాలలో వైసిపి ఇన్చార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతున్న సమయంలో తమకు మరో ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థనను నేరుగా అధినేతకు చెప్పడం కోసం, చాలామంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

 YSRCP MLAs queue to Tadepalli.. trying to please cm Jagan on tickets

అయితే సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వారిలో కొంతమందికి పార్టీ అధినేత సీఎం జగన్ నుంచి పిలుపు రాగా, మరికొందరు నేరుగా ఆయనకు విజ్ఞప్తి చేసుకునేందుకు వెళ్లారు. విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా పాణ్యం, నంద్యాల, కర్నూలు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వారిలో ఉన్నారు.

సీఎం క్యాంప్ కార్యాలయానికి ఒక్కసారే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో తాడేపల్లిలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి, రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. కీలక సమన్వయకర్త ధనుంజయ రెడ్డిని సీటు మార్పు విషయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిసి చర్చిస్తున్నారు. మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

అయితే సీఎం జగన్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో ఉన్న గ్రాఫ్, సీట్ల మార్పుకు సంబంధించినటువంటి కారణాలను పార్టీ సీనియర్లు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు ప్రకాశం నెల్లూరు జిల్లాల ఇన్చార్జి విజయసాయిరెడ్డి కూడా టికెట్ల వ్యవహారం, బలోపేతం చేయడం వంటి విషయాలపై వైసీపీ మంత్రులు, నేతలతో చర్చించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ సహా పలువురు నాయకులతో భేటీ అయిన ఆయన పార్టీకి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ, టికెట్ కోసం ఆరాటపడుతున్న నేతలు తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+