Duvvada Srinivas: భార్యాపిల్లలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ అర్ధరాత్రి దాడి-నన్నే ప్రశ్నిస్తారా ?
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఆయన అక్రమ సంబంధాన్ని తప్పుబడుతూ ఇప్పటికే భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి మరోసారి ఆయన ఇంటికి వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఆయన వారిపై దాడికి దిగారు. తన అక్రమ సంబంధాన్నే ప్రశ్నిస్తారా అంటూ వారిపై రెచ్చిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.

అర్ధరాత్రి వేరే మహిళతో దొరికిన జగన్ శిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను...
— Telugu Desam Party (@JaiTDP) August 10, 2024
నిలదీసిన భార్య, పిల్లల పై పచ్చి బూతులు తిడుతూ, రాడ్డు తీసుకుని చంపే ప్రయత్నం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను. అడ్డుకున్న పోలీసులు. పోలీసులు అడ్డుకోకపోతే జగన్ రెడ్డి శిష్యుడు, భార్యని, పిల్లలని… pic.twitter.com/5yqejC6HEI
కొంతకాలంగా భార్య దువ్వాడ వాణికి, కుమార్తెలకు దూరంగా మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తండ్రిని కలిసేందుకు వచ్చిన కుమార్తెలను మాధురి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. తన తండ్రిని కలుస్తామంటే ఎలా అడ్డుకుంటారంటూ మాధురిపై దువ్వాడ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిన్న అర్ధరాత్రి మరోసారి భార్య వాణి, కుమార్తెలు కలిసి దువ్వాడ శ్రీను ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆయన బయటికి రావాల్సిందేనంటూ అక్కడే బైఠాయించారు.
దీంతో చాలాసేపటి తర్వాత బయటికి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ భార్యా పిల్లలపై రెచ్చిపోయారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగారు. అక్కడే ఉన్న కర్ర తీసుకుని వారిపైకి వెళ్లారు. నన్ను రోడ్డుకి ఈడుస్తారా అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై దాడికి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు, పోలీసులు కలిసి అడ్డుకున్నారు. వైసీపీ లో ఇటువంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు దువ్వాడ సతీమణి వాణి ఆరోపణలకు శ్రీనివాస్ తో ఉంటున్న మాధురి స్పందించారు. శ్రీనివాస్ ఏడాది గా బయట ఉంటే అప్పుడు పిల్లలకు,భార్యకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. నన్ను బజారుకి లాగారు.. ఇప్పుడు నాకు దువ్వాడ శ్రీనివాస్ దిక్కు అని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నారు. ఇకపై తానూ, దువ్వాడ కలిసే ఉంటామన్నారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను ఆయన చేరదీశారని, తనకు ముగ్గురు కుమార్తెలని, ఆర్ధికంగా బాగానే ఉన్నామన్నారు. తాను డబ్బు కోసం దువ్వాడ వద్దకు రాలేదని, ఏ దిక్కూ లేక దగ్గరయ్యానన్నారు. భార్య వాణికీ, దువ్వాడకూ సమస్యలు ఉంటే తేల్చుకోవాలన్నారు. అన్నీ కుదిరితే తామిద్దరం పెళ్లి చేసుకుంటామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications