సుబ్బారెడ్డి హత్యకు కుట్ర! పరారీలో భూమా అఖిలప్రియ: జగన్ పార్టీ ఎమ్మెల్సీ సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సంచలన ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

సుబ్బారెడ్డి హత్యకు అఖిలప్రియ సుపారీ..
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిని చంపించడానికి మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ రూ. 50 లక్షలు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఇంత చిన్న వయస్సులోనే హత్యలు చేయించాలని చూశారని మండిపడ్డారు. హత్యకు పురమాయించిన ముగ్గురు వ్యక్తులు కడప పోలీసులకు దొరికిపోయారని వివరించారు. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ పోరిపోయారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

పరాయి రాష్ట్రానికి అఖిలప్రియ పరారీ...
అహోబిలం నృహింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, అక్కడ అభిషేకాలకు వెళ్లామని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
తమ కోసమే ఆలయం తెరిచారని ఆరోపించడం సరికాదని అన్నారు. కరోనా నుంచి ప్రజల్ని బయటపడేయాలని స్వామివారికి పూజలు చేశామని, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అఖిలప్రియపై ఆయన మండిపడ్డారు. పరాయి రాష్ట్రంలో తలదాచుకున్న అఖిలయప్రియ తమపై ఆరోపణలు చేస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రభాకర్ రెడ్డిపై అఖిలప్రియ విమర్శలు
ఆళ్లగడ్డలో చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా పద్ధతి మార్చుకోలేదని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కాగా, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబం కోసమే అహోబిలం నృసింహస్వామి ఆలయా తలుపులు తెరిచారంటూ ఇటీవల భూమా అఖిలప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. కొన్ని ఫొటోలు కూడా ట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. కరోనా పరిస్థితుల్లోనూ అధికార వైసీపీ నేతల కోసం ఆలయాలు తెరుచుకుంటున్నాయంటూ ఆరోపించారు.
Recommended Video

ఇటీవలే ముగ్గురు నిందితుల అరెస్ట్..
ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ. 3.2లక్షల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుబ్బారెడ్డి హత్యకు రూ. 50 లక్షలు డీల్ కుదుర్చుకున్నారని కడప డీఎస్పీ సూర్యనారాయణ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరుకుంటుందనే చర్చ ఇప్పుడు కర్నూలు కడప జిల్లాల్లో నడుస్తోంది. ఇక ఏవీ సుబ్బారెడ్డి రాజకీయ చరిత్ర చూస్తే 2009లో నాడు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2014లో భూమా కుటుంబం వైసీపీలో చేరడంతో వారితో పాటే వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం భూమా కుటుంబం తిరిగి టీడీపీలో చేరడంతో నాగిరెడ్డితో పాటే ఏవీ సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు. నాగిరెడ్డి మరణంతో ఆయన ఒంటరివారయ్యారు. అయితే, ప్రస్తుతం ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉండటంతో అఖిలప్రియ ఆయనను దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications