వాలంటీర్లపై పవన్ టార్గెట్ వెనుక, భారీ స్కెచ్ - 2019 రిపీట్..!!

జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. సీఎం పైన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న పవన్..ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పైన గురి పెట్టారు. పక్కా ప్లాన్ ప్రకారమే పవన్ వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ప్రతీ గడపకు అనుసంధానం అయింది. అటువంటి వాలంటీర్ల పైనే అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో
2019 రిపీట్ వుతున్నట్లు కనిపిస్తోంది.

వాలంటీర్లను టార్గెట్ చేసిన పవన్:వాలంటీర్లపైన ఏలూరు సభలో సంచలన ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్..తరువాత తాను అందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. పవన్ వ్యాఖ్యల పైన వాలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. పవన్ తన వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్..

YSRCP moving with counter sketch against Pawan Kalyan on targetting Volunteer system in AP

వైసీపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెండో విడత వారాహి యాత్ర తొలి సభలోనే వాలంటీర్లను టార్గెట్ చేసారు. ఇది వ్యూహాత్మకంగా...ప్రణాళికా బద్దంగానే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ పథకాలే తనను తిరిగి అధికారంలోకి వస్తాయని నమ్ముతున్నారు. పథకాలు లబ్దిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే పర్యవేక్షణలో వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

న్యాయ పోరాటానికి సిద్దమంటూ:ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 రకాల సేవలు ప్రజలకు డోర్ ముందుకు వెళ్తున్నాయి. ప్రతీ ఇంటికి వాలంటీర్ తో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి...ప్రజలకు వారధులుగా వాలంటీర్లు మారారు. ఈ వ్యవస్థ బలం గుర్తించిన టీడీపీ-జనసేన దీనిని బ్రేక్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ వ్యవస్థను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు.

YSRCP moving with counter sketch against Pawan Kalyan on targetting Volunteer system in AP

వాలంటీర్లపైన అనుమానాలు రేకెత్తించి ముందుగా ప్రజల్లో వారి పైన వ్యతిరేకత తీసుకురావాలనేది ఆ రెండు పార్టీల ప్రయత్నంగా వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే టీడీపీ నుంచి వాలంటీర్ల వ్యవస్థ పైన స్పందన లేదు. గతంలో టీడీపీ సైతం వాలంటీర్ల వ్యవస్థపైన ఆరోపణలు చేసినా..తరువాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

2019 రిపీట్ అవుతోందా:ఇప్పుడు పవన్ వాలంటీర్ వ్యవస్థ పైన ఆరోపణలు మొదలు పెట్టారు. న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ హాయంలో సేవా మిత్రా యాప్ పైన నాడు వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అదే తరహాలో వాలంటీర్ల పైన పవన్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో విపక్ష నేతగా జగన్ నాటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పవన్ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతామని...న్యాయపోరాటం చేస్తామని పవన్ ప్రకటించారు. అయితే అదే సమయంలో ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ చేస్తున్న ఆరోపణల పైన సాధారణ ప్రజల్లోనూ చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+