రాజకీయ సమీకరణాలు మారుతాయి, బాబుపై ఈసీకి ఫిర్యాదు: మేకపాటి సంచలనం
అమరావతి:తమ పార్టీకి 20 మంది ఎంపీలను గెలిపిస్తే డిమాండ్ చేసి ఏపీకి రావాల్సిన నిధులను, హక్కులను సాధించుకొంటామని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు.టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీరు వల్లే ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.అయితే రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని మేకపాటి అభిప్రాయపడ్డారు.
Recommended Video

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రజాప్రతినిధులను టిడిపిలోకి ఆకర్షిస్తున్న విషయమై వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్‌కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. టిడిపి తీరు వల్లే ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.
అంతేకాదు టిడిపి నేతలు వైసీపీ నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ సమీకరణాలు మారుతాయి
రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.తమ పార్టీకి 9 మంది ఎంపీలుంటే ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత ప్రస్తుతం 5 ఎంపీలే మిగిలారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 20 ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్టానికి రావాల్సిన నిధులను, హక్కులను సమకూర్చుకొనేందుకు డిమాండ్ చేసే వీలుంటుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

బాబు వల్లే ఏపీకి తీవ్ర నష్టం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరహలో తాము కక్కుర్తి పడడం లేదని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము తమ వంతు పోరాటం చేస్తున్నామని మేకపాటి రాజమోహన్ రెడ్డి గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టిడిపి కూడ చేయలేనిది తాము సాధిస్తామని చెప్పడం లేదన్నారు. కానీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కక్కుర్తి వల్లే ఏపీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

టిడిపి డబ్బులు ఆశ చూపుతోంది
తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు టిడిపి ప్రజా ప్రతినిదులు, నేతలు డబ్బులు ఆశను చూపి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఓ టిడిపి ఎంపీ తమ పార్టీకి చెందిన ఎంపీతో ఈ మేరకు సంప్రదింపులు జరిపారని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఎపీ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.

ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు చేస్తాం
ఎన్నికల సంఘానికి కూడ ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.ఫిభ్రవరి9వ,తేదిన ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగా అందరినీ కలుస్తున్నామని చెప్పారు.సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసీని కలుస్తామని తెలిపారు.మరో వైపు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర గురించి రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ గురించి ప్రస్తావించారని చెప్పారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications