బడ్జెట్ దెబ్బ- టీడీపీలో అంతర్మథనం?
Peddireddy Mithun Reddy: కేంద్ర ఆర్థిక శాఖ మంత్ర నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. బిహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు గానీ, పథకాలను గానీ కేటాయించకపోవడం వల్ల నిరాశను వ్యక్తం చేసింది.
బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (యునైటెడ్) కీలకంగా వ్యవహరిస్తోన్నప్పటికీ- ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులను రాబట్టుకోవడంలో నితీష్ కుమార్ పైచేయి సాధించారని అన్నారు.

ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. బడ్జెట్‌లో బిహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించిందని, ఇచ్చింది గుండుసున్నానేనని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
జాతీయ స్థాయిలో భారీగా మెడికల్ సీట్లను పెంచుతామంటూ నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను పెద్దిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెడికల్ సీట్లను భారీగా పెంచుతామని కేంద్రం చెబుతోండగా.. ఉన్న సీట్లు కూడా తమకు వద్దని, వాటిని రద్దు చేయాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖను రాసే దుస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు.
15 శాతం గ్రోత్ రేట్ సాధిస్తానంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పెద్దిరెడ్డి తప్పుపట్టారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి పాలన ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన, సూఫర్ 6 పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల వృద్ధిరేటు పడిపోయిందని అన్నారు.
63 శాత మంది రైతులే ఉన్నారని, వాళ్లకు ప్రభుత్వం ఏం చేసిందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మైనస్‌లో ఉండటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులు, ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాలు బాగున్నప్పుడే వృద్ధిరేటు సాధ్యపడుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications