పార్లమెంట్‌లో సొమ్మసిల్లిపడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్: ఐసీయూలో చికిత్స
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో సోమవారం ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సుభాష్ చంద్రబోస్‌ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు.

Recommended Video
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తెలుగు ఎంపీలు ఆస్పత్రి వద్దకు చేరుకుని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కళ్లు తిరిగినట్లు పడిపోయినట్లుగా తెలిసింది. అంతకు ముందు.. ఆరో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సాయంత్రం 4 గంటలకు లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా సంస్మరణ సందేశం చదివి వినిపించారు.












Click it and Unblock the Notifications