తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ బెయిల్ రద్దుపై మరో పిటిషన్ -భరతం పట్టేదాకా వదలను -వైసీపీ ఎంపీ రఘురామ అనూహ్యం

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని, 11 కేసుల్లో నిందితుడిగా ఉండి సహనిందితులకు పదవులిచ్చి, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, మొత్తంగా కేసులను జావగార్చుతూ న్యాయ వ్యవస్థకే సవాలు విసిరుతున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు అయ్యే దాకా ఏపీలో అడుగుపెట్టబోనని శపథం చేసిన ఆయన తాజాగా మరో సంచలనానికి ఉపక్రమించారు..

సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్

బెయిల్ రర్దుదకు మరో పిటిషన్

బెయిల్ రర్దుదకు మరో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఐ కోర్టుకు సోమవారం సెలవు లేదని, ఈసారి తప్పనిసరిగా తన పిటిషన్ న్యాయస్థానం స్వీకరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ తన పిటిషన్ విచారణకు రాకపోతే.. హైకోర్టుకు వెళతానని తేల్చి చెప్పారు. ఈ మేరకు సీబీఐ కోర్టుకు శనివారం ఓ లేఖ రాసినట్టు తెలిపారు.

నీ భరతం పడతా చూడు..

నీ భరతం పడతా చూడు..

సీబీఐ కేసుల్లో సీఎం జగన్ అంతు తేల్చేదాకా ఏపీలో అడుగుపెట్టబోబని శపథం చేశారు ఎంపీ రఘురామ. సీబీఐ, జగన్ మధ్య లోపాయికారి అవగాహన సాగుతోందన్న ఎంపీ.. పబ్లిక్ ప్రాసిక్యూటర్.. నిందితుడి తరఫున పని చేస్తున్నారా లేక సీబీఐ తరఫున పని చేస్తున్నారా అన్నది సోమవారం తెలుస్తుందన్నారు. సోమవారం నాటి ఉత్తర్వుల తర్వాత జగన్ శిబిరం 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' అని పాడుకుంటారో.. ''నీ పాపం పండెను నేడు... నీ భరతం పడతా చూడు'' అని అంటారో తేలిపోతుందని రఘురామ అన్నారు.

సాగర్ ఉపఎన్నికలో అనూహ్య ట్విస్ట్ -12 ఏళ్ల తర్వాత కారుకు కమ్యూనిస్టుల మద్దతు! -కేసీఆర్ సభ రద్దుకు పిల్సాగర్ ఉపఎన్నికలో అనూహ్య ట్విస్ట్ -12 ఏళ్ల తర్వాత కారుకు కమ్యూనిస్టుల మద్దతు! -కేసీఆర్ సభ రద్దుకు పిల్

డబ్బు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం..

డబ్బు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం..

జగన్ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి ఎంపీ రఘురామ గతంలోనే సీబీఐ కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేయడం, సాంకేతిక కారణాలతో అది విచారణకు రాకపోవడం తెలిసిందే. పిటిషన్‌లో జగన్‌ బెయిల్‌ రద్దుకు సంబంధించి తాను సమర్పించిన ఆధారాలపై సీబీఐ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో తాజాగా మరో పిటిష్ వేశారు. ఇక తిరుపతి ఉప ఎన్నికపై మాట్లాడుతూ, డబ్బు పంచడం తప్పని, ఒక వేళ పంచితే అది ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా తీసుకోండి కానీ డబ్బు పంచేవాళ్లకు ఓట్లేయకండి అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓటర్లకు సూచించారు.

English summary
Narasapuram YSRCP Raghu Ramakrishna Raju once again will file a petition in the CBI court in Hyderabad seeking revocation of AP CM Jagan's bail. in a statement released on Sunday, the rebel mp said the CBI court was not on leave on Monday and was confident that his petition would be accepted by the court this time. If his petition does not come up for hearing .. he decided to go to the high court. He said the CBI had written a letter to the court on Saturday to this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X