విజయ్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది వీళ్లే- ఆమెకు అనుకోని ఛాన్స్

తమిళనాడు రాజకీయాల్లో నేడు నవశకం మొదలు కాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. ఇంకాస్సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. బీజేపీ, ఏఐఏడీఎంకేలను అధికారానికి దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చిన్న పార్టీలతో దీర్ఘకాల చర్చల తర్వాత ఈ ప్రభుత్వం కొలువుదీరింది.

ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరగనుంది. నటుడిగా ప్రవేశించి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు పరంపరను కొనసాగిస్తోన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలిచి టీవీకే రికార్డు సృష్టించారు. 234 మంది సభ్యుల అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు లభించింది. అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118.

Aadhav Arjuna Keerthana Bussy Anand Sengottaiyan among 9 TVK Ministers to be sworn in Today

కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి లభించిన మద్దతు లభించింది. ఆయా పార్టీలు అందించిన లేఖలను గవర్నర్ కు సమర్పించారు. దీంతో నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ను నియమిస్తూ శనివారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో మే 13, లేదా ఆలోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా విజయ్ తో పాటు మొత్తం తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించిన మంత్రుల జాబితా ప్రకారం..

బస్సీ ఎన్ ఆనంద్- టీనగర్

ఆధవ్ అర్జున- విల్లివాక్కం

కేజీ అరుణ్ రాజ్- తిరుచెంగోడు

కేఏ సెంగోట్టయ్యన్- గోబిచెట్టిపాళ్యం

పీ వెంకటరమణన్- మైలాపూర్

సీటీఆర్ నిర్మల్‌ కుమార్- తిరుప్పరన్‌కుండ్రం

రాజ్‌మోహన్- ఎగ్మోర్

టీకే ప్రభు- కారైకుడి

ఎస్ కీర్తన- శివకాశి ఉన్నారు.

తొలి మంత్రివర్గంలోనే 29 సంవత్సరాల కీర్తనకు అవకాశం కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నూతనంగా కొలువుదీరబోయే మంత్రివర్గంలో మహిళల కోటా నుంచి ప్రస్తుతానికి ఆమెకు మాత్రమే అవకాశం లభించింది. ఇప్పుడున్న మంత్రుల సంఖ్య పరిమితమే కావడం వల్ల మున్ముందు మంత్రివర్గ విస్తరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కు కూడా ఈ మంత్రుల జాబితాలో చోటు దక్కలేదు. అలాగే బయటినుంచి మాత్రమే మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం వల్ల వామపక్షాలనూ తీసుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+