వైసీపీలో రాజుకున్న అసమ్మతి కుంపటి: జగన్ బతిమాలితేనే పార్టీలోకి: గేరు మార్చిన ఆ ఎంపీ

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కుంపటి రాజుకున్నట్టే కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు, అనుసరిస్తోన్న విధానాలపై తరచూ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్న వైఎస్ఆర్సీపీ నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి ఆయన గేరు మార్చారు. మొన్నటిదాకా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన తాజాగా పార్టీ నాయకులను టార్గెట్‌గా చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా కామెంట్లు చేశారు.

సోమవారం ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. తాను మొదట వైఎస్ఆర్సీపీలో చేరాలని అనుకోలేదని అన్నారు. వైసీపీ నాయకులు కాళ్లా, వేళ్లా పడితేనే అందులో చేరానని చెప్పారు. పార్టీలో చేరాలని వైఎస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి పలుమార్లు బతిమాలారని అన్నారు. నరసాపురం లోక్‌సభ స్థానంలో తాను పోటీ చేస్తేనే.. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని జగన్ భావించారని, ఆయన పట్టుబట్టడం వల్లే చేరానని చెప్పారు. తాను కాకుండా ఇంకెవరు పోటీ చేసి ఉన్నా..వైసీపీ అభ్యర్థి నరసాపురం స్థానంలో ఓడిపోయే వాళ్లని అన్నారు.

YSRCP MP Raghurama Krishnamraju once again criticising own party leaders

Recommended Video

    టిడిపి MP Ram Mohan Naidu కి వైసిపి MP Vijaya Sai Reddy Counter

    వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలను రఘురామ తప్పు పట్టారు. జగన్ చూపు తన మీద కాకుండా.. కొత్తగా చేరిన గోకరాజు గంగరాజుపై ఉందంటూ ప్రసాదరాజు చెప్పడం సరికాదనిఅన్నారు. జగన్ తన పట్ల సానుకూలంగా ఉన్నారని, తనపై సదభిప్రాయం ఉందని చెప్పారు. జగన్ వల్లే తాను పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్ కాగలిగానని అన్నారు. వైసీపీలో ఎలాంటి కోటరీలు లేవని, వైఎస్ జగన్‌కు అందరూ సమానమే అన్నారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు మంత్రిపదవి కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే వైఎస్ జగన్ దృష్టిలో పడటానికి ఆయన తనపై వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామ అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+