వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ

|
Google Oneindia TeluguNews

సొంత పార్టీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అదే పనిగా ఆరోపణలు, విమర్శలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి అధినేతకు సవాలు విసిరారు. స్థాయిలను ఎంచుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపైనా తీవ్ర కామెంట్లు చేశారు. జగన్ బెయిల్ రద్దు వివాదంలో వైఎస్ విజయమ్మను ప్రస్తావించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. ఏ1, ఏ2ల నేర చరిత్రపై ప్రధాని నరేంద్ర మోదీకి, దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాశానని చెప్పారు. ప్రెస్ మీట్ లో ఎంపీ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలుజగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

విజయమ్మ అలా చెప్పడంతో..

విజయమ్మ అలా చెప్పడంతో..

''జగన్ బెయిల్ రద్దు విచారణకు సంబంధించి ఈ రోజు ఆసక్తిగా ఎదురు చూశాం. కానీ, పాపం, సీబీఐ లాయర్లకు జ్వరం రావడంతో కేసు విచారణ 30కి వాయిదా పడింది. అధినేత జగన్ బెయిల్ రద్దు కోరుతూ నేనెందుకు పిటిషన్ వేశానని చాలా మంది తిడుతున్నారు. జగన్ అంటే నాకు ఇష్టం, గౌరవం కాబట్టి, ఆయనను ఎవరూ మాట అనొద్దని, కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటికి రావాలన్నదే నా ఆకాంక్ష అదీగాక, ''అమ్మా.. అందరూ ఈ అవినీతి ఎందుకు చేస్తారు? నాన్న గారిలా నిజాయితీగా ఉండొచ్చు కదా?'' అని జగన్ బాబు వాపోయినట్లుగా వైఎస్ విజయమ్మ చెప్పిన మాటలు(నాలో నేను పుస్తకంలో) నన్నెంతగానో కదిలించాయి. అవినీతి అనే పదాన్నే అసహ్యించుకునే జగన్ పై ఎవరూ పల్లెత్తి మాట అనొద్దన్నదే నా తాపత్రయం..

షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్

Recommended Video

CM Jagan Delhi Tour In Next Week Becoming Crucial In AP Politics | Oneindia Telugu
ప్రధాని చెంతకు సాయిరెడ్డి బాగోతం..

ప్రధాని చెంతకు సాయిరెడ్డి బాగోతం..


నేనేదో అప్పులు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతానని ఏ1 జగన్ ప్రోద్బలంతో ఏ2 సాయిరెడ్డి ప్రధానికి లేఖ రాశాడు. నిజానికి, ఎంకే స్టాలిన్ తో కలిసి జగన్ నా పవర్ ప్రాజెక్టులను మూయించాడు, ఆ నాడు తమిళనాడులో ఏం జరిగింది, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ల ద్వారా నేనేం ప్రయత్నాలు చేశానన్న వివరాలతోపాటు సాయిరెడ్డి సూట్ కేస్ కంపెనీల బాగోతం, క్విడ్ ప్రోకో లీలలు అన్నీ ప్రధానికి పూసగుచ్చినట్లు వివరించాను. దేశంలోని ఎంపీలు అందరికీ లేఖలు రాస్తాను. 20కిపైగా కేసుల్లో నిందితుడైన సాయిరెడ్డి పాస్ పోర్టు కోసం ప్రయత్నించొచ్చుగానీ, ఎఫ్ఐఆర్ దాఖలైనందుకు నేను విదేశాలకు వెళ్లొద్దా? అసలు,

జగన్‌కు నిజంగా దమ్ముంటే వేటేయాలి

జగన్‌కు నిజంగా దమ్ముంటే వేటేయాలి


ఆనాడు శంకర్ రావుకు దొరికిన కొన్ని ఆధారాలతో కేసు వేస్తే సీబీఐ జేడీ లక్ష్మిణారాయణ అంతవరకే విచారణ చేశారు. కానీ నా దగ్గర అంతకు మించి, మరో 11 అక్రమాలకు సంబంధించిన వివరాలను కోర్టుకు ఇచ్చాను. ఇదంతా జగన్ స్వాతిముత్యంలా కేసుల నుంచి బయటపడాలనే చేస్తున్నా. అసలు ఆయనతో ఢికొట్టడానికి నా స్థాయెంత? నేనొక ఆఫ్ట్రాల్ గాడిని, జగన్ ఆకాశమైతే, నేను నేల లాంటోణ్ని, నా మీదా మీ ప్రతాపం? సరే, నిజంగా జగన్ కు దమ్ముంటే, పోలవరం, విశాఖ ఉక్కు లేదా మరేదైనా ఏపీ సమస్యపై ఎంపీలు రాజీనామా చేయాలని ఆదేశిస్తే ఠక్కున శిరసావహిస్తా. ఆదేశించే దమ్ము సీఎంకు ఉందా? పార్లమెంట్ బయటేమో ప్రజాసమస్యల ప్లకార్డులు, సభ లోపలేమో నాపై అనర్హత వేటుకు పోరాటం. ఇదేనా రాష్ట్రం కోసం జగన్ చేయిస్తున్నది, సాయిరెడ్డి చేస్తున్నది? దమ్ముంటే నాపై అన్హత వేటు వేయొచ్చుకదా, అది మీ చేతులో పనే కదా?'' అని ఎంపీ రఘురామ ప్రశ్నించారు.

English summary
narasapuram ysrcp mp raghurama krishnam raju wrote a letter to pm modi and all mps of andhra pradesh cm ys jagan and mp vijayasai reddy. raghurama alleges that jagan and sai reddy both have criminal history. the rebel mp challenges cm to sack him from party. raghurama also made comments on cbi cases against ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X