వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ మరో కలకలం-జగన్ మినహా మిగిలిన సీఎంలకు లేఖ-అసెంబ్లీ తీర్మానాలకు

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో కలకలం రేపారు. తనపై మోపిన రాజద్రోహం సెక్షన్‌కు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో చర్చ కోరుతూ ఓ భారీ ప్రయత్నమే చేశారు. ఏకంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. ఇందులో సీఎం జగన్‌ను మాత్రం వదిలేశారు. ఏపీలో సీఐడీ తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలుపెట్టి, ఆ తర్వాత సీఐడీ కస్టడీలో దాడి, ఇతరత్రా పరిణామాల్ని ఆయన లేఖల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం సెక్షన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఎంలకు పిలుపునిచ్చారు.

Recommended Video

Narsapuram Mp కేసులో ట్విస్ట్, HRC సీరియస్..!!
 రఘురామరాజు మరో కలకలం

రఘురామరాజు మరో కలకలం

ఏపీ సీఐడీ తనపై మోపిన రాజద్రోహం కేసు, సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడిపై ఇప్పటికే అన్ని పార్టీల ఎంపీలకు లేఖలు రాసి స్పందన రాబట్టిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో కలకలం రేపారు. ఈసారి ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్ధాయిలో ఉన్న నేతల్ని ఆకర్షించే లక్ష్యంతో మరో భారీ ప్రయత్నం చేశారు. ఇందులో తన విషయంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పూసగుచ్చినట్లు వివరించారు. అంతటితో ఆగకుండా వారి ముందు కీలక డిమాండ్లు పెట్టారు. దీంతో రఘురామ చేసిన ఈ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

 జగన్‌ తప్ప అందరు సీఎంలకు రఘురామ లేఖలు

జగన్‌ తప్ప అందరు సీఎంలకు రఘురామ లేఖలు

తనపై ఏపీ సీఐడీ మోపిన రాజద్రోహం సెక్షన్, కస్టడీలో దాడిపై ఎంపీలకు లేఖలు రాసిన రఘురామరాజు ఈసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఏపీ సీఎం జగన్‌ మినహా మిగిలిన సీఎంలకు రఘురామ ఈ లేఖలు రాశారు. సీఐడీ తనను అరెస్టు చేసిన దగ్గరి నుంచి చోటు చేసుకున్న అన్ని పరిణామాల్ని అందులో ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా రాజద్రోహం సెక్షన్‌ చుట్టూ ఆయన లేఖ తిరిగింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ప్రయోగిస్తున్న రాజద్రోహం సెక్షన్‌కు సంబంధించి సీఎంల ముందు ఆయన పెట్టిన డిమాండ్‌ చూస్తే ఇప్పుడు జాతీయ స్ధాయికి ఈ చర్చకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

జగన్‌ బెయిల్‌ రద్దు కోరినందుకే అరెస్ట్‌

జగన్‌ బెయిల్‌ రద్దు కోరినందుకే అరెస్ట్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తాను పిటిషన్ వేసినందువల్లే వైసీపీ ప్రభుత్వం తనపై కక్షగట్టి వేదింపులకు దిగుతోందని రఘురామరాజు సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జగన్ బెయిల్‌ రద్దు కోరినందుకు తనపై కక్షగట్టి సీఐడీ పోలీసులు ధర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలని రఘురామరాజు ఈ లేఖలో ఆరోపించారు. ఇప్పటికే ఎంపీలకు రాసిన లేఖల్లోనూ రఘురామ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై పలువురు ఎంపీలుస్పందిస్తున్న నేపథ్యంలో సీఎంల వద్దా రఘురామ అదే ప్రస్తావన చేశారు.

రాజద్రోహం సెక్షన్‌పై అసెంబ్లీ తీర్మానాలు

రాజద్రోహం సెక్షన్‌పై అసెంబ్లీ తీర్మానాలు

ఏపీ సీఐడీ ఓ సిట్టింగ్‌ అయిన తన విషయంలో వ్యవహరించిన తీరుపై పార్లమెంటులో ప్రస్తావిస్తానని, ఇందుకు మీ ఎంపీల మద్దతు ఇప్పించాలని సీఎంలకు రఘురామ విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నమోదు చేస్తున్న రాజద్రోహం సెక్షన్‌ 124ఏకు వ్యతిరేకంగా తమ రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కూడా రఘురామరాజు తన లేఖలో సీఎంలను కోరారు. అయితే కేంద్రంతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు విస్తృతంగా వాడుతున్న ఈ సెక్షన్‌కు సంబంధించి ఆయా రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

English summary
ysrcp mp raghurama raju on today request all chief ministers except andhra cm ys jagan seeking assembly resoution over removal of sedition section in ipc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X