వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి రఘురామ లేఖ- కేంద్రం కోర్టులోకి బంతి-కీలకమైన సమస్యపై జోక్యానికి వినతి

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా సాగుతున్న రాజకీయాలు ఇప్పుడు ప్రధాని కోర్టులోకి చేరాయి. ఏపీలో తనపై వైసీపీ సర్కారు వేధింపుల్ని ఇప్పటివరకూ సీఎంలు, గవర్నర్‌లూ, ఎంపీల దృష్టికి తెచ్చుకెళ్లిన రఘురామరాజు తాజాగా ప్రధానికి ఫిర్యాదు చేశారు. అయితే ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో తనపై వేధింపుల్ని కాకుండా మరో కీలకమైన అంశాన్ని ఆయన తీసుకెళ్లారు. ప్రధాని తక్షణం జోక్యం చేసుకోని ప్రజాప్రయోజనాల్ని కాపాడాలని రఘురామరాజు కోరారు. ఇప్పటికే సీఎం జగన్‌కు వారంరోజులుగా రోజుకో లేఖ రాస్తున్న రఘురామ ఇవాళ ప్రధానికి రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

 ప్రధాని మోడీకి రఘురామ లేఖ

ప్రధాని మోడీకి రఘురామ లేఖ


ఏపీలో తాజాగా నెలకొన్న పరిస్ధితులపై ప్రధాని మోడీకి వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని ఆయన మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. తాను లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రఘురామ పేర్కొన్నారు. వీటిపై తక్షణం జోక్యం చేసుకుని ప్రజా ప్రయోజనాల్నికాపాడాలని రఘురామ కోరారు. ఇప్పటివరకూ ఎంపీలు, గవర్నర్లు, సీఎంలకే లేఖలు రాస్తున్న రఘురామ తొలిసారిగా ప్రధానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

జగన్‌ సర్కారుపై ప్రధానికి ఫిర్యాదు

జగన్‌ సర్కారుపై ప్రధానికి ఫిర్యాదు

ప్రధానికి రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఏపీలోని వైసీపీ సర్కార్‌ రాష్ట్ర ఆర్ధిక స్ధితిని ఎలా మారుస్తోంది, పరిమితికి మించి ఎలా రుణాలు తీసుకుంటోంది, రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా తాకట్టు పెడుతోంది, బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు, ఇలా పలు అంశాన్ని రఘురామరాజు ప్రధాని మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. ఇప్పటివరకూ విపక్షాలు ఇవే అంశాలపై నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు రఘురామ వాటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లయింది.

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోందని, స్తోమతకు మించి ప్రభుత్వం అప్పులు చేయడమే ఇందుకు కారణమని రఘురామ రాజు తన లేఖలో ప్రధానికి వివరించారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మరీ అప్పులు తీసుకుంటున్నారని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)కి ఆస్తులు బదలాయించి మరీ ప్రభుత్వం వాటిని తనఖా పెడుతోందన్నారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తీసుకున్న ప్రభుత్వం.. ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విశాఖలో లులూ గ్రూప్‌ నుంచి భూములు తీసుకుని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని రఘురామ వివరించారు.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
కేంద్రం జోక్యానికి రఘురామ వినతి

కేంద్రం జోక్యానికి రఘురామ వినతి

ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు చేస్తోందని, సుమారు రూ.35 వేల కోట్లకు పైగా అప్పులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని రఘురామ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది సగటు నెలకు రూ.9226 కోట్ల అప్పులు చేశారని వివరించారు. ఉచిత పథకాల కోసం రూ.13 వేల కోట్లు అప్పు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆర్ధిక క్రమశిక్షణ గాడితప్పిందని, కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై దృష్టిపెట్టాలని రఘురామ విజ్ఞప్తి చేశారు. ప్రజాసంక్షేమం ముసుగులో వ్యక్తిగత లబ్ది నెరవేర్చుకునే విధానం కనిపిస్తోందన్నారు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలన్నారు.

English summary
ysrcp rebel mp raghurama krishnam raju on today wrote a letter to pm modi explaining financial situation in ap, and state govt's unlimited loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X