కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి- ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్...
వారం రజుల క్రితం కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
వైసీపీలో క్రియాశీల నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కరోనా సమయంలోనూ విశాఖతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు కూడా పర్యవేక్షించారు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది.

Recommended Video
దీంతో పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండబోతున్నట్లు ఆయన అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో తాజా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశముంది.












Click it and Unblock the Notifications