ఈ సారి ఆ 23 కూడా రావటగా

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

YSRCPs MP Vijayasai Reddy hits back TDP

రాష్ట్రస్థాయిలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వరుసగా నిరసన ప్రదర్శనలను చేపడుతోంది. మొన్నటికి మొన్న మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించింది. తాజాగా కాంతిలో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యురో సభ్యుడు వర్ల రామయ్య, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఉదయం వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. కోట్లాది రూపాయల మేర అవినీతికి పాల్పడి, విచారణను ఎదుర్కొంటోన్న చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తోన్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.

ప్రజాధనం లూటీ చేసినందుకు జైలుపాలైన చంద్రబాబు కోసం ఆయన పార్టీ చేస్తున్న దీక్షలు, అహంకారపూరిత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. 21 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజా పోరాటాలను గాలికి వదిలేసి జైలుపాలైన ఒక్కడిని బయటకు తీసుకుని రావడానికి నానాయాగీ చేస్తోందంటూ ధ్వజమెత్తారు.

కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబే టీడీపీకి ముఖ్యమైనప్పుడు ప్రజలు ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు. టీడీపీ చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లన్నింటినీ లెక్క వేసి చూస్తే 2019లో వచ్చిన ఆ 23 సీట్లు కూడా 2024 ఎన్నికల్లో వచ్చేలా కనిపించట్లేదని సాయిరెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్రాన్ని ఆర్పేసిన చంద్రబాబు కోసం తామెందుకు ఇళ్లల్లో లైట్లను ఆర్పేయాలని సొంత టీడీపీ నాయకులే అంటోన్నారని సాయిరెడ్డి చెప్పారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చినట్లు సమాచారం అందిందని చెప్పారు. చంద్రబాబు అరెస్టయినందుకు ఆ టీడీపీ నేతల ఆనందమే వేరులేనని వ్యాఖ్యానించారు. టీడీపీ ఆరిపోయే దీపం అని సింబాలిక్‌గా చెప్పడం ఎదైతో ఉందో...నభూతో నభవిష్యత్ అంటూ సెటైర్లు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+